బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మన్‌గా జిందం కళా చక్రపాణి వరుసగా రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనను మూడో వార్డు ప్రజలు గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన చైర్మన్ పదవికి సహకరించిన తోటి 27 మంది కౌన్సిలర్లకు ఆమె అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు. తనను నమ్మి బాధ్యతలు అప్పగించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్లకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రాబోయే రోజుల్లో గతంలో కంటే ఎక్కువగా అభివృద్ధి పనులు చేస్తూ, సిరిసిల్ల పట్టణంలోని 39 వార్డులను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఆమె హామీ ఇచ్చారు.
