బలగం టీవీ, ఎల్లారెడ్డిపేట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన ఆంధ్రప్రభ తెలుగు దినపత్రిక జర్నలిస్టు గృహప్రవేశానికి మండల ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు హాజరయ్యారు. గుర్రాల చంద్రమోహన్ రెడ్డి రాచర్ల గొల్లపల్లి గ్రామంలో నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఇందుకు సోమవారం రోజు సత్యనారాయణ వ్రతం చేసి గణపతి హోమం చేశారు. ఇంటికాలే మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గౌరీ శంకర్, ప్రధాన కార్యదర్శి అనిల్, ముత్తయ్య, కిషోర్, రవికాంత్ గౌడ్, శేఖర్,సురేష్ యాదవ్, కృష్ణ, ప్రవీణ్, నరేష్, దుర్గం విజయ్, జగదీష్ లు హాజరై చంద్రమోహన్ రెడ్డి దంపతులను ఆశీర్వదించారు.