– నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలంటూ డిమాండ్
- ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టాప్ టెన్ ఇష్యూలలో నేరెళ్ల బాధితుల అంశం ఒకటని, దీనిని అడ్డం పెట్టుకొని న్యాయం చేయకుండా రాజకీయ లబ్ధి పొంది పొందడం సిగ్గుచేటని తీన్మార్ మల్లన్న అన్నారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో తొమ్మిది సంవత్సరాల క్రితం పోలీసుల థర్డ్ డిగ్రీకి గురైన బాధితులను పరామర్శించిన అనంతరం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ.. నేరెళ్ల బాధితులను హింసించిన వారు ఇప్పటికీ పదవుల్లో కొనసాగుతున్నారని, వారిని వాడుకున్నవారు ప్రమోషన్లు పొందారని, కానీ బాధితులు మాత్రం న్యాయం కోసం ఎదురుచూస్తూ జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత పాలకులతో మీరు రాజీ పడ్డారా? లేదా బాధితులకు న్యాయం చేస్తారా? అనే అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.అలాగే, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమారి ని తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి పొందిందని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బాధితులకు న్యాయం చేయలేకపోవడం సిగ్గుచేటని అన్నారు.
