బలగం టివి,సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గా కాదాసు శేఖర్ ను నియమిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనాథ్ ఉత్తర్వులు జారి చేశారు.ఈసందర్బంగా కాదాసు శేఖర్ మాట్లాడుతూ నానీయామనికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ లు సురభి ద్వివేది, రమేష్ బాబు ,తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి ,డిసిసి అద్యక్షులు అది శ్రీనివాస్,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనాథ్ లకు కృతజ్ఞతలుతెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకు వెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు ,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్దిమల్ల భాను, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గుడిసె ప్రభాకర్, అసెంబ్లీ సెక్రటరీ అకేని సతీష్ నాయకులు తిరుపతి, కదాసు రాజు, తదితరలు నాయకులు పాల్గొన్నారు.