బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ అంతర్ జిల్లా T-20 లీగ్ టోర్నమెంట్‌లో భాగంగా ఈరోజు ఉదయం జరిగిన తొలి మ్యాచ్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా జట్టు ఘనవిజయం సాధించింది. పెద్దపల్లి జిల్లా జట్టుతో జరిగిన ఈ పోరులో సిరిసిల్ల జట్టు అన్ని విభాగాల్లోనూ రాణించి 84 పరుగుల భారీ తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజన్న సిరిసిల్ల జట్టు నిర్ణీత ఓవర్లలో 158 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించింది. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పెద్దపల్లి జట్టు, సిరిసిల్ల బౌలర్ల ధాటికి ఓటమి చెందింది. ఫలితంగా సిరిసిల్ల జట్టు 84 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
ఈ అద్భుత విజయం సాధించిన సిరిసిల్ల జిల్లా జట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పూర్మనీ లింగారెడ్డి, టీమ్ ఇంచార్జి డి. శ్రీనివాస్, ప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు.
