రూ .765 కోట్ల నష్టం..కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాగ్ నివేదిక..
బలగం టివి,సిరిసిల్ల:
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాగ్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు. ప్రాజెక్ట్ వ్యయం భారీగా పెరిగినా దాని వల్ల కలిగే అదనపు ప్రయోజనం శూన్యమేనని తెలిపింది. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం రీ డిజైన్ చేసి కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టులుగా విభజించి, రీ ఇంజినీరింగ్, మార్పుల పేరిట ఇప్పటికే చేసిన కొన్ని పనులు నిరర్ధకమయ్యాయని కాగ్ వెల్లడించింది. దీంతో రూ.765 కోట్ల నష్టం వచ్చిందని వెల్లడించింది. పనుల అప్పగింతలో నీటిపారుదల శాఖ అనవసరమైన తొందరపాటును కనబరిచింది. డీపీఆర్ ఆమోదం కూడా కాకముందే 17 పనులను అప్పగించేసింది , కాళేశ్వరం మూడు టీఎంసీ పనులను అనవసరంగా ప్రారంభించారు. దీనివల్ల రూ.25వేల కోట్ల అదనపు ఖర్చు అయింది. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అంచనా వ్యయం 35 వేల కోట్లు కాగా.. రీ డిజైనింగ్ తర్వాత రెండు ప్రాజెక్టుల అంచనా వ్యయం 85 వేల 650 కోట్లకు పెరిగింది. అయితే ప్రాజెక్టు వ్యయం 122 శాతం పెరగగా.. ఆయకట్టు 52 శాతం మాత్రమే పెరిగిందని తెలిపింది . సాగునీటిపై మూలధన వ్యయం ఒక్కో ఎకరాకు రూ.6.42 లక్షలు అవుతుంది. ఇది భవిష్యత్తులో మరింత తగ్గిచ్చు. ప్రాజెక్ట్ ప్రయోజనం, వ్యయ నిష్పత్తి 1.51 శాతంగా అంచనా వేయగా అది వాస్తవానికి 0.75 శాతంగా తేలుతోంది. రీ ఇంజినీరింగ్ తర్వాత కూడా మరిన్ని మార్పులు చేశారని.. ఫలితంగా కాళేశ్వరం వ్యయం వడ్డీతో సహా లక్షా 47 వేల 427 కోట్లకు పెరిగిందని వెల్లడించింది.. మల్లన్న సాగర్ను లోతైన భూకంప సంబంధిత అధ్యయనాలు చేయకుండా నిర్మించారు.అని కాగ్ నివేదిక పేర్కొంది