ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలి, డిపో మేనేజర్‌కు కంచర్ల రవి గౌడ్ వినతి…

0
26

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, సిరిసిల్ల డిపో పరిధిలోని ప్రతి గ్రామానికి సకాలంలో బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలని నాయకులు కంచర్ల రవి గౌడ్ డిపో మేనేజర్‌ను కోరారు. శుక్రవారం డిపో కార్యాలయంలో అధికారులను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకోవడం ఎంతో కీలకమని, బస్సు సౌకర్యం సరిగ్గా లేక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు బస్సుల కోసం ఎదురుచూసి, ఆలస్యంగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పరీక్షల దృష్ట్యా రద్దీ ఉన్న రూట్లలో వెంటనే అదనపు మరియు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలి. పరీక్షలు ముగిసే వరకు విద్యార్థులు ఎక్కడ చేయి ఎత్తినా బస్సులు ఆపేలా డ్రైవర్లకు కఠిన ఆదేశాలు జారీ చేయాలి. ఉదయం మరియు సాయంత్రం వేళల్లో బస్సులు కచ్చితంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేలా పర్యవేక్షించాలి.

విద్యార్థుల భవిష్యత్తు విషయంలో అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని, ఈ సమస్యను అత్యవసరంగా పరిగణించి తక్షణ పరిష్కారం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మట్టి శ్రీనివాస్, వడ్లూరి వేణు, నవీన్, సాయి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here