బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
కుల గణన సర్వేపై కుతంత్రం బీసీ లను మోసం చేస్తున్న కాంగ్రెస్
ఈ రోజు తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశంలో కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ బీసీలను ఎలక్షన్ల అప్పుడే గుర్తుకొస్తుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ కు కట్టుబడి ఉండాలని రవి గౌడ్ అన్నారు. 2014 లో కేసిఆర్ ప్రభుత్వం చేసిన సర్వేలో బీసీలు 52 శాతం ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో 45 శాతం ఎలా చేస్తారని, బిసి కుల గణనపై బీసీ మూడు బిల్లులను తెలంగాణలో ప్రవేశపెట్టే వరకు తగ్గేదే లేదని స్పష్టం చేశారు, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన బీసీ హక్కులకు రాజ్యాంగ రక్షణ రాకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. బీసీలకు రాజ్యాంగ రక్షణ కల్పించి ఉంటే అభివృద్ధిలో ఇండియా అమెరికాను దాటిపోయేదని చెప్పారు దేశవ్యాప్తంగా జరిగే జనగణలు బీసీ కులగణను చేపట్టాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారని బీసీలకు జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను గురించి వివరించారు ఇంతకాలం బిజీగా రిజర్వేషన్ లేక ఎంతోమంది విద్యార్థులు ప్రజలు నష్టపోయారని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని, బీసీ కులాలను ఐక్యంగా చేయడానికి ఎమ్మెల్సీ కవిత ప్రయత్నం చేస్తున్న వివిధ సంఘాల నాయకులతో కలిసి ధన్యవాదాలు తెలియజేశారని అన్నారు.
బీసీలకు న్యాయం జరిగిందంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అని, బీసీలకు విద్య ఉపాధి రాజకీయం రంగంలో 46% రిజర్వేషన్లు వేరువేరుగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీసీ మేధావులు విద్యార్థులు బీసీ సంఘాలన్నీ మీరు చేసన సర్వే ముక్తకంఠంతో వాదిస్తే మళ్లీ రీసర్వే అని బీసీలను మోసం చేసాడని కంచర్ల రవి గౌడ్ అన్నాడు బీసీలను మోసం చేస్తే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో ఉద్యమాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు బీసీల జనాభాను తగ్గించి చూపేందుకు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ బీసీ కుల గణన చేపడుతుందని తువి పట్టారు బీసీలను మోసం చేస్తే సహించే ప్రసక్తి లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమం లో అనిల్,తిరుపతి,సంపత్,నిఖిల్,లక్ష్మణ్,సంతోష్,రాజు తదితరులు పాల్గొన్నారు.