బలగం టీవీ, హైదరాబాద్:
కరీంనగర్ జిల్లాకు చెందిన యువ సంచలనం పేరాల అమన్ రావు (Perala Aman Rao) ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అడుగుపెట్టబోతున్నారు. అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఈ 21 ఏళ్ల యువ బ్యాటర్లను రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌కు సొంతం చేసుకుంది. కరీంనగర్ జిల్లా నుంచి ఐపీఎల్‌కు ఎంపికైన తొలి ఆటగాడిగా అమన్ రావు సరికొత్త చరిత్ర సృష్టించారు. అమన్ రావు స్వస్థలం కరీంనగర్ జిల్లా, సైదాపూర్ మండలం, వెన్నంపల్లి గ్రామానికి చెందినవారు. ప్రస్తుతం వీరి కుటుంబం హైదరాబాద్‌లో నివసిస్తోంది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) తరఫున అండర్-19, అండర్-23 విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేశారు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో 160కి పైగా స్ట్రైక్ రేట్‌తో రెండు మెరుపు అర్ధ సెంచరీలు సాధించి ఐపీఎల్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. అమన్ తండ్రి మధుసూదన్ రావు గతంలో జిల్లా స్థాయి క్రికెటర్. తండ్రి ప్రోత్సాహంతోనే అమన్ చిన్నతనం నుండి క్రికెట్‌లో శిక్షణ పొందారు.
