బలగం టివి, ఇల్లంతకుంట
రూ.30లక్షల50 వేల నిధులు మంజూరు చేసిన గౌరవ ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ
గ్రామస్థులతో కలసి భూమి పూజ చేసిన గౌరవ ఎంపిపి
గౌరవ మానకొండూర్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఇల్లంతకుంట గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వరద నీటి ప్రవాహం రాకుండా డ్రైనేజీ నిర్మాణం కోసం రూపాయలు 30 లక్షల 50 వేల నిధులను కేటాయించడం జరిగిందని గౌరవ ఎంపీపీ ఇల్లంతకుంట వుట్కూరి వెంకటరమణారెడ్డి అన్నారు , గౌరవ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు, ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం నుండి ,ఎంపీడీవో కార్యాలయం మీదుగా పోలీస్ స్టేషన్ వరకు డ్రైనేజీ నిర్మాణంతో పాటుగా సిసి వర్క్ కోసం గ్రామస్తులతో కలిసి శుక్రవారం భూమి పూజ చేయడం జరిగింది , ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి కొబ్బరికాయ కొట్టి భూమి పూజను ప్రారంభించారు, కొన్ని ఏళ్లుగా వర్షాలతో నీరు రావడంతో డ్రైనేజీ లేకపోవడం వల్ల, బస్టాండ్ ఆవరణలోని దుకాణ సముదాయాల వారికి, ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడేవారు .దీంతో ఈ విషయం గౌరవ ఎమ్మెల్యే గారు గమనించి వరద నీటిని మళ్లించేందుకు ఈజీఎస్ నిధుల ద్వారా డ్రైనేజీ ఏర్పాటు చేయాలని సూచించడం జరిగిందని ,ఈ మేరకు నిధులు మంజూరు చేసిన గౌరవ ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు .
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఒగ్గు నరసయ్య యాదవ్, మాజీ సర్పంచ్ కూనపోయిన భాగ్యలక్ష్మి బాలరాజు, సీనియర్ నాయకులు చిట్టి ఆనంద రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మామిడి నరేష్ ,ఎఈ అజారుద్దిన్, పంచాయతీ కార్యదర్శి వరుణ్, తాజా&మాజీ వార్డు సభ్యులు ,వర్తక వ్యాపారు లు, యువజన సంఘాల నాయకులు, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.