కేసీఆర్ ఒక ఉద్యమం, ఒక విజన్, యుగ ప్రభంజనం..

0
39
  • మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు

బలగం టీవీ, హైదరాబాద్:

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సోషల్ మీడియా వేదికగా అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగంతో కూడిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ కేవలం ఒక వ్యక్తి కాదు, తెలంగాణ ఆత్మగౌరవానికి నిదర్శనమని ఆయన కొనియాడారు.

“కేసీఆర్ అనే మూడు అక్షరాలు ఒక యుద్ధ నినాదం, దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షల ప్రతిధ్వని” అని హరీశ్ రావు పేర్కొన్నారు. యావత్ తెలంగాణను ఏకతాటిపైకి తెచ్చి, రాష్ట్రాన్ని సాధించిన దృఢసంకల్పం ఆయనదని కొనియాడారు. తెలంగాణ చరిత్రలో ప్రతి తరానికి ఒక టార్చ్‌బేరర్ ఉంటారని, కానీ మొత్తం తెలంగాణకే కేసీఆర్ ఒక టార్చ్‌బేరర్ అని అభివర్ణించారు. ఆధిపత్య శక్తుల కుట్రలను తన వ్యూహాలతో పటాపంచలు చేసిన ధీశాలి కేసీఆర్ అని ప్రశంసించారు. కేసీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. “మీరు కేవలం నా మేనమామ మాత్రమే కాదు, నా సర్వస్వం. రాజకీయంగా నాకు ఓనమాలు దిద్దించి, ప్రజా సేవలో నన్ను తీర్చిదిద్దారు” అని హరీశ్ రావు ఎమోషనల్ అయ్యారు.

రాజకీయంగా నాకు ఓనమాలు దిద్దించి విలువలు నేర్పించి ప్రజా సేవలో నన్ను తీర్చిదిద్దారు.ఉద్యమనిర్మాతగా ప్రగతి ప్రదాతగా దేశచరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న మీ జన్మదినం తెలంగాణ ప్రజలకు పర్వదినం…మీరు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని, జాతికి మీ నాయకత్వం మరిన్ని దశాబ్దాలు దిశా నిదర్శనం చేయాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.తెలంగాణ ప్రజలకు ఎనలేని విశ్వాసం, ఎనలేని ప్రేరణ అయిన ప్రియతమ నేత కేసీఆర్ కి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here