- ఒడిశా తీరాన అద్భుత సైకత శిల్పం ఏర్పాటు చేసిన భారాస నేత చిర్రా రవీందర్ యాదవ్
- ఒడిశా రాష్ట్రంలో జన్మదినం సందర్భంగా కేసీఆర్ సైకత శిల్పం
- పర్యాటకులను ఆకట్టుకుంటున్న కేసీఆర్ సైకత శిల్పం
బలగం టీవీ, ఒడిశా:
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలు ఆదివారం ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా శేరిలింగంపల్లికి చెందిన ఉద్యమకారుడు, భారాస సీనియర్ నాయకులు చిర్రా రవీందర్ యాదవ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయించిన కేసీఆర్ సైకత శిల్పం పర్యాటకులను మంత్రముగ్ధులను చేసింది.
ఈ సందర్భంగా చిర్రా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. “తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను నిజం చేసిన మహోన్నత నాయకుడు కేసీఆర్. తెలంగాణ జాతిపితగా ఆయన చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆరు దశాబ్దాల పోరాటాన్ని గమ్యానికి చేర్చి, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత ఆయనదే. నేడు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పూరీ జగన్నాథుడి ఆశీస్సులతో ఈ సైకత శిల్పం ద్వారా మా గౌరవాన్ని చాటుకుంటున్నాం. రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం ఎప్పటికీ పదిలం. త్వరలోనే మళ్ళీ ప్రజా ఆశీర్వాదంతో కేసీఆర్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చి అన్ని విమర్శలకు అభివృద్ధి ద్వారానే సమాధానం చెప్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు భారాస కార్యకర్తలు, తెలంగాణ నుండి వచ్చిన పర్యాటకులు పాల్గొని కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

