ఘనంగా కేసిఆర్ జన్మదిన వేడుకలు..

0
51

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు 72వ జన్మదిన వేడుకలు ఘనంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ కె డి సి సి బ్యాంకు చైర్మన్ కొండూరి రవీందర్ రావు, సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళ కలిసి పార్టీ నాయకులతో కేక్ కట్ చేశారు.

అనంతరం తెలంగాణ భవన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం తోట ఆగయ్య మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్ర హోదా సాధించాలన్న సంకల్పంతో కేసీఆర్ ఉద్యమాన్ని ప్రారంభించారని అన్నారు. పదవులను తృణప్రాయంగా త్యజించి, ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణాలకైనా తెగించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానేతగా నిలిచారని అన్నారు.

2014లో అధికారంలోకి వచ్చిన అనంతరం తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ మరెన్నో జన్మదినాలు ఆరోగ్యంగా, ఆనందంగా జరుపుకోవాలని  ఆకాంక్షించారు.

ఇక్కడ సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్  రాపెల్లి లక్ష్మి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కుంబాల మల్లారెడ్డి, మ్యాన రవి, బొల్లి రామ్మోహన్, సత్తర్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here