బలగం టివి, రాజన్న సిరిసిల్ల
బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల 30 నిమిషాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ భవన్ లో “తెలంగాణ రాష్ట్ర ప్రదాత తెలంగాణ జాతిపిత గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కోండూరి రవిందర్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టెక్స్ టైల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల కార్యదర్శి మ్యన రవి,, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య,రాజన్న, , బొల్లి రామ్మోహన్, మరియు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
