బలగం టివి, రాజన్న సిరిసిల్ల
- బేటి పడావో.. బేటి బచావోలో కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కెజిబివిలలో” షీరో” పేరుతో పైలట్ ప్రాజెక్ట్ అమలు
- రాష్ట్ర ప్రభుత్వం , టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో
జిల్లాలో పైలట్ కార్యక్రమం
“షీరో “తో జిల్లాలోని కేజిబివి విద్యార్థినిల జీవన నైపుణ్యాల అభివృద్ధి
- కార్పొరేట్ కు ధీటుగా కేజిబివి లలో కార్యక్రమాలు
- భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా ప్రణాళికలు.
- కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేక పర్యవేక్షణ

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కేజిబివి విద్యార్థినిలు
ప్రపంచంతో పోటీపడేలా…. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా లైఫ్ స్కిల్స్ (జీవన నైపుణ్యాల) అభివృద్ధికి
ప్రభుత్వం ప్రాధాన్యతనీస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సౌజన్యంతో
కార్పొరేట్ కు ధీటుగా కేజిబివి లలో కార్యక్రమాలు చేపడుతూ.. విద్యార్థినిలలో సమగ్ర వ్యక్తిత్వ వికాసం దిశగా, వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించి హీరో అనే అర్థం వచ్చేలా షీరో(SHERO- Stembased holistic education with right orientation) పేరుతో ఈ ప్రాజెక్ట్ ను జిల్లాలోని అన్ని కేజీబివి లలో అమలు చేస్తుంది.
జిల్లా విద్యా శాఖ, సంక్షేమ శాఖ లు ఈ ప్రాజెక్ట్ అమలు బాధ్యత చూస్తున్నారు.
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఈ ప్రాజెక్టు అమలను ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తూ ప్రాజెక్ట్ ప్రభావంతంగా అమలయ్యేందుకు, మంచి ఫలితాలు వచ్చేలా అధికారులకు సూచనలు ,సలహాలు ఇస్తున్నారు.
రాష్ట్రంలో ప్రప్రథమంగా రాజన్నసిరిసిల్లలో ఈ ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతున్నది.
కార్పొరేట్ విద్యకు దీటుగా..
గ్రామీణ, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన కస్తుర్బాగాంధీ విద్యార్థినులు ప్రస్తుత ప్రపంచంలో నిలదొక్కుకునేలా బేటి పడావో.. బేటి బచావోలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శిక్షణ ఇప్పిస్తున్నాయి. లింగ వివక్ష అంతమొందించేందుకు లింగ సమానత్వo, సాధికారిత సాధించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ సామాజిక శాస్త్రాల్లో మేటి టాటా ఇన్స్టిట్యూట్ అఫ్ సోషల్ సైన్స్ ముంబైతో ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి.
షేరో(SHERO- Stembased holistic education with right orientation) ప్రాజెక్ట్ ద్వారా పిల్లలకు సైన్స్ పాఠాలు, టెక్నాలజీ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్ మొదలైన సబ్జెక్టులలో నైపుణ్యం పెంపొందించేందుకు ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేశాయి. కార్పొరేట్ విద్యకు దీటుగా కేజీబీవీల్లో నూతన ఒరవడితో ఈ ల్యాబ్ లు సిద్దం చేశాయి. అన్ని విధాలుగా ప్రణాళిక బద్ధంగా రూపొందించిన సిలబస్ ను అందిస్తున్నారు.
ప్రత్యేక నైపుణ్యాలు నేర్పించేందుకు..
రాష్ట్రంలో ప్రపథమంగా ప్రయోగాత్మకంగా రాజన్నసిరిసిల్ల జిల్లాలోని మొత్తం 13 కస్తుర్భాగాంధీ విద్యాలయాల్లో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఆయా స్కూల్ లలో 6,7,8,9 వ తరగతికి చెందిన విద్యార్థినులను రెండు గ్రేడులుగా విభజిస్తారు. వారికి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ లాంటి అంశాలను ప్రాక్టికల్ గా నేర్పించడం, కృత్యాదార పద్దతి ద్వారా విద్యను అందించడం, ప్రయోగ నైపుణ్యాలఫై శిక్షణ ఇస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా జీవన, ఆంగ్లభాష నైపుణ్యాలు, ఇంగ్లిష్ లో మాట్లాడేందుకు, భాషఫై పట్టు సాధించేందుకు, ప్రత్యేకమైన ప్రణాళిక అమలు చేస్తున్నారు. అలాగే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి? కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి? నిర్ణయం తీసుకోవడం, సమస్య పరిష్కారం, నాయకత్వం, నిర్వహణ, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలంటే ఏ నైపుణ్యాలు ఉండాలనే అంశాలు వివరిస్తున్నారు. ప్రతి విద్యార్థికి ప్రత్యేక నైపుణ్యాలు నేర్పించేందుకు కౌన్సిలర్ తో కూడిన టీంను ఏర్పాటు చేశారు.
సంక్లిష్టమైన భావనలు సులభంగా..
థింకర్ ల్యాబ్ కింద సుమారు 76 ప్రాజెక్టులు, ఎలక్ట్రానిక్స్ అండ్ రోబోటిక్ కింద 46 ప్రాజెక్టులు, ఎలక్ట్రో మాగ్నెటిక్ కింద సుమారు 30 ప్రాజెక్టులను చేసేలా సామగ్రిని తెప్పించారు. ప్రత్యేకంగా చేయించిన ఈ సామగ్రితో విద్యార్థులకు సంక్లిష్టమైన భావనలను సులభంగా అర్థం చేసుకునేందుకు ఎంతో దోహదపడుతున్నది. అలాగే వారికి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అంశాలపై పట్టు సాధించేందుకు ఉపయోగపడుతుంది. ఆయా అంశాల్లో శిక్షణను నిష్ణాతులైన ప్రొఫెసర్లు, పాఠశాల విద్యాశాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో కూడిన బృందం పర్యవేక్షిస్తున్నది.
ఇటీవలే ఈ ప్రాజెక్ట్ అమలును
రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ తంగళ్లపల్లి కేజిబివిలో పరిశీలించింది.
విద్యార్థినులు వివిధ ప్రాజెక్ట్ లలో భాగంగా వారు నేర్చుకున్న అంశాలను, కమ్యునికేషన్ స్కిల్ లను చూసి ప్రశంసించింది.
కంగ్రాట్యులేషన్….. బెరుకు లేకుండా చాలా బాగా వివరించారు అంటూ విద్యార్థులను కార్యదర్శి అభినందించి వెన్ను తట్టారు
ఇంగ్లిష్ ఎంతో ఈజీగా..
- సీహెచ్ లక్షణ, 7వ తరగతి విద్యార్థిని, కేజీబీవీ తంగళ్ళపల్లి

ఇంగ్లిష్ ఫై పట్టు త్వరగా సాధించేందుకు శిక్షణలో చాలా మెలుకువలు చెప్పారు. ఆంగ్లం ఇంత ఈజీగా నేర్చుకోవచ్చో తెలిసింది. ఉన్నత చదువులకు సాయపడుతుంది.
మ్యాథమేటిక్ ఫై పట్టు సాధించా..
- కే తేజస్విని, 9వ తరగతి విద్యార్థిని
ఈ శిక్షణలో భాగంగా మాకు మ్యాథమేటిక్ లోని వివిధ అంశాలఫై వివరించారు. ఎంతో క్లిష్టమైన సమస్యలఫై
ట్రైనర్ల సహాయంతో సులువుగా పట్టు సాధిస్తున్న. ఉన్నత చదువులకు ఉపయోగ పడుతుంది.
విద్యార్థినులకు ఎంతో మేలు..
కస్తుర్భాగాంధీ విద్యార్థినులకు ఇంగ్లిష్, మాథ్స్, జీవన నైపుణ్యాలఫై శిక్షణ ఇస్తున్నాం. వారిలోని సృజనాత్మక వెలికి తీసేందుకు ఉపయోగ పడుతుంది. విద్యార్థినులు భవిష్యత్తులో ఏదైనా రంగంలో రాణించేందుకు దోహదపడుతున్నది.
- పీ రజిత లైఫ్ స్కిల్ శిక్షకురాలు
వినూత్న పరికరాల తయారీ
- ఎ రమేష్ కుమార్, డీఈఓ, లక్ష్మీరాజం, జిల్లా సంక్షేమ అధికారి
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంపూర్ణ సహకారంతో షేరో ప్రాజెక్ట్ ను విజవంతంగా అమలు చేస్తున్నాం. మంచి ఫలితాలు వస్తున్నాయి.
కస్తుర్భాగాంధీ విద్యార్థినులకు శిక్షణ వారికి ఎంతో మేలు చేస్తుంది. వినూత్నమైన పరికరాలు ఎలా వినియోగించాలోనేరుగా తెలుసుకుంటున్నారు. ప్రైవేటు విద్యాలయాలకు దీటుగా శిక్షణ కొనసాగుతున్నది. కమ్యునికేషన్ స్కిల్ ఇంప్రూవ్ అయ్యింది.
