బలగం టివి,
కరీంనగర్ మాతా శిశు హాస్పటల్ నుండి కిడ్నాప్ ఘనటను 24 గంటలు గడవకముందే ట్రేస్ చేసేశారు. మూడు రోజుల పసికందును ఎత్తుకెళ్లిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసులు ఎట్టకేలకు కిడ్నాపర్ తో పాటు పసికందును పెద్దపల్లి జిల్లాలో పట్టుకున్నారు. ఆదివారం మద్యాహ్నం ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ కొద్ది సేపటి క్రితం పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ సమీపంలో పట్టుకుని బిడ్డను ఎంసీహెచ్ లో ఉన్న తల్లి చెంతకు చేర్చారు. కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ నేతృత్వంలో కరీంనగర్ టూ టౌన్, జమ్మికుంట, స్పెషల్ బ్రాంచ్, టాస్క్ ఫోర్ట్ టీమ్స్ కిడ్నాప్ గుట్టును రట్టు చేశాయి.