ఎల్లారెడ్డిపేట మండల బిజెపి ఎస్టీ మండల మోర్చా అధ్యక్షుడు గుగులోతు అనిల్ నాయక్ మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది .ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి అనిల్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గిరిజనుల కోసం కాంగ్రెస్ పార్టీ తరతరాలుగా వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తుందన్నారు .గిరిజనుల రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు .అటవీ ప్రాంతం పై హక్కులను కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు .గిరిజనులకు ఇండ్ల నిర్మాణంలో ఇందిరాగాంధీ హయాం నుండి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నిబద్దతతో పనిచేస్తుందన్నారు .అనిల్ తో పాటు బుగ్గ రాజేశ్వర తండా కు చెందిన నునావత్ యాదగిరి ,దుమాల గ్రామానికి చెందిన మల్యాల రమేష్ ,బీఆర్ఎస్ పార్టీ నుండి అజ్మీర్ లాల్ సింగ్ నాయక్ లను పార్టీలో చేర్చుకున్నారు .ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి పసుల కృష్ణ ,జిల్లా కార్యదర్శి లింగం గౌడ్ ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య ,నాయకులు సూడిద రాజేందర్ ,రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.