సిరిసిల్ల న్యూస్: సిరిసిల్ల నియోజకవర్గం
సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి గురువారం నామీనేషన్ దాఖలు చేశారు. సిరిసిల్ల లో నామీనేషన్ అనంతరం విలేకరులతో మాట్లాడారు. సిరిసిల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురువేస్తానని పేర్కొన్నారు. మందు, డబ్బులు పంచను అని చెబుతున్న మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నడి చౌరస్తాలో అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేయాలన్నారు. చెప్పేటివి ఒక్కటి..చేసేటివి ఒకటి అని విమర్శించారు. రాష్ట్రాన్ని దోచుకోని ప్రజలను ఆన్యాయం చేస్తున్నరన్నారు. సిరిసిల్ల లో బతుకమ్మ చీరల పేరతో కొంత మందినే బతికిస్తున్నరని, కార్మికులను నష్టం చేస్తున్నరన్నారు. ఒకనాడు సిరిసిల్ లో 37 వేల సాంచెలు ఉండేవని ఇప్పుడు 17 వేలు పడిపోయాయన్నారు. బతుకమ్మ చీరలు తప్ప సిరిసిల్ల లో ఏ పని చేయకుండా.. చేశారన్నారు. అవినీతి ప్రభుత్వానికి కాలం చెల్లిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్షల కోట్లతో కట్టి.. ప్రజల సొమ్మును దోచుకున్నరని ఆరోపించారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ కృంగిపోయిందని.. దానిని సమర్థించుకునేందుకు లేని పోని మాయమాటలు చెబుతున్నరన్నారు.