- ముస్తాబాద్ లో టీ స్టాల్ ప్రారంభం.
బలగం టీవి,, ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్త సంజయ్ ని కేకే మహేందర్ రెడ్డి పరామర్శించారు.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ గడ్డి సంజయ్ ని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని తమవంతు ఆర్థిక సహాయం చేశారు. ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని కేకే పేర్కొన్నారు.సంజయ్ కి అండగా ఉంటానని వారి కుటుంబానికి కేకే
హామీ ఇచ్చారు. తదుపరి ఎచ్ పి పెట్రోల్ బంక్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన టీ స్టాప్ దుకాణాన్ని ప్రారంభించి సొంతంగా ఎదగాలని స్టాల్ యజమానులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాల్ రెడ్డి,ఎస్సీ బీసీ సెల్ అధ్యక్షులు నర్సింలు, ప్రశాంత్,ఎంపీటీసీ శ్రీనివాస్ పట్టణ అధ్యక్షుడు రాజు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
