కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర స్థాయి చేనేత అవార్డులు – 2026: దరఖాస్తుల ఆహ్వానం..

0
61

చేనేత మరియు జౌళి శాఖ, రాజన్న సిరిసిల్ల (పూ.అ.భా)

సహాయ సంచాలకులు

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

జాతీయ చేనేత దినోత్సవం 07.08.2026 సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కళాకారులకు శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులకు ఔత్సాహికుల నుండి దరఖాస్తులు కోరడమైనది.

ఈ అవార్డులు చేనేత కళాకారులకు మరియు చేనేత డిజైనర్లకు వారి వృత్తిలో నైపుణ్యత మరియు ప్రత్యేకతల ఆధారంగా ఇవ్వడం జరుగును. అవార్డు గ్రహీతలకు రూ.25,000/- నగదు, చేనేత శాలువా, మెమెంటో మరియు మెరిట్ సర్టిఫికెట్ తో సత్కరించడం జరుగును.

అర్హతలు:

  1. చేనేత కళాకారులు: తేది: 31.12.2025 నాటికి 30 సంవత్సరముల వయసు నిండిన వారు చేనేత రంగం లో 10 సం.లకు తగ్గకుండా అనుభవం కలిగి ఉండవలెను.
  2. చేనేత డిజైనర్లు: తేది: 31.12.2025 నాటికి 25 సంవత్సరముల వయసు నిండిన వారు చేనేత డిజైన్స్ రంగం లో 5 సం.లకు తగ్గకుండా అనుభవం కలిగి ఉండవలెను.

కావున పై అర్హతలు కలిగిన ఔత్సాహికులు నిర్ణీత దరఖాస్తు ఫారము నింపి, వారి నైపుణ్యతను దాటీ నమూనాలను (శాంపిల్స్) సహాయ సంచాలకులు, చేనేత మరియు జౌళి శాఖ, రాజన్న సిరిసిల్ల గారి కార్యాలయము నందు తేది: 31.03.2026 లోగా సమర్పించవలెను. తదుపరి వచ్చే దరఖాస్తులు స్వీకరించబడవు. మరియు దరఖాస్తుదారుడి ఉత్పత్తిని మగ్గముపై తనిఖీ చేయడం జరుగుతుంది. దరఖాస్తు ఫారము మరియు మరియు ఇతర వివరముల కొరకు సహాయ సంచాలకులు, చేనేత మరియు జౌళి శాఖ, రాజన్న సిరిసిల్ల గారి కార్యాలయమును సంప్రదించగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here