బలగం టివి,సిరిసిల్ల:
నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కౌన్సిల మరియు బ్యాంకర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్‌గా నాఫ్స్ కాబ్ ,టెస్కాబ్ చైర్మన్ కోండూరి రవీందర్ రావు వరుసగా రెండవసారి నామినేట్ అయ్యారు. కేంద్ర హోం మరియు సహకార మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఎన్సిడిసి వివిధ రకాల రుణాలు, వ్యవసాయం ,దాని అనుబంధ రంగాలకు సహాయం చేయడానికి మరియు ఆర్థిక సామర్థ్యం పెంపొందించేందుకు సంస్ధ పనిచేస్తున్నది.ఎన్సిడిసి పాలక మండలి సభ్యుని పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. పాలక మండలి సభ్యులు ప్రతి త్రైమాసికంలో ఒకసారి సమావేశమవుతారు.అదేవిధంగా కోండూరి రవీందర్ రావు కర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ లక్నో, ఉత్తరప్రదేశ్, మూడు సంవత్సరాల కాలానికి పాలక మండలి సభ్యునిగా తిరిగి నామినేట్ అయ్యారు. బిఐఅర్డి అనేది నాబార్డ్ యొక్క ప్రధాన సంస్థ, ఇది గ్రామీణ సహకార రంగం మరియు వాణిజ్య బ్యాంకుల ఉద్యోగులందరికీ సామర్థ్యంను పెంపొందించేందుకు శిక్షణ ఇస్తున్నది.దేశంలోని ప్రధాన సంస్థలైన ఎన్ సిడిసి మరియు బిఐఅర్డి సంస్థలకు గవర్నింగ్ కౌన్సిల్ సభ్యునిగా కోడూరు రవీందర్ రావు తిరిగి నామినేట్ చేయడంతో తెలంగాణ రాష్ట్ర సహకార రంగానికి శుభపరిమణామని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.