కోరిన కోరికలు తీర్చే కోంగు బంగారం..మల్లారెడ్డిపేట అంజన్న.మాండవ్య  నది తీరన అద్భుతమైన శిల్ప కట్టడం.

0
306

  • కాకతీయ కళా నైపుణ్యాన్ని చాటుతున్న  అనాటి శిల్ప కళ..
  • తొమ్మిది అడుగుల ఏకశిలా విగ్రహం లో దర్శనమిస్తున్న  అంజన్న
  • ఈ నెల 9 న మాఘ అమావాస్య  జాతర..

బలగం టివి,సిరిసిల్ల:

అద్దంలా మెరిసే బండలు, చుట్టూ గుట్టలు,పచ్చని పోలాలు,పారే జలపాతం, ప్రశాంతమైన వాతావరణం ఈ ప్రాంతమంతా ప్రకృతి రమణీయతకు  పెట్టింది పేరు కాకతీయుల కళా వైభవాన్ని చాటే రెండంతస్తుల అపురూప రాతి కట్టడం.చారిత్రాత్మక ప్రాధాన్యాన్ని సొంతం చేసుకున్న దేవాలయం ఇది.  ఇక ప్రత్యేక విశేషం ఏంటంటే రాముని మరియు ఆంజనేయుని గుళ్ళు  అభిముఖంగ ఉండడమే కాకుండా ఆ హనుమంతుని కంటి కాంతి  కిరణాలు రామునిపాదాల్ని ఎల్లవేళలా  స్ప్రుశించేలా చేసిన ఆ తీరు మహద్బుతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా  గంభీరావుపేట మండలం భీముని  మల్లారెడ్డి పేట గ్రామం లోని  శ్రీ వీరాంజనేయ స్వామి కోరిన కోరికలు తీర్చే దేవుడిగా పూజలందుకుంటున్నాడు.  భక్తులకు స్వామి తొమ్మిది అడుగుల ఏకశిలా విగ్రహం లో దర్శనమిస్తాడు.

స్థల పురాణం…

శ్రీ సీతారాములు ఆలయంతో పాటు వెంకటేశ్వర స్వామి,  శివ ఆలయాలు కూడా ఉన్నాయి.పూర్వం ఈ మూడు ఆలయలును భక్తులు దర్శించుకోని,రోజు పూజలు చేసేవారు దేవుళ్లకు  ఎంతో ప్రీతితో పలు రకాల నైవేద్యాలు తీసుకెళ్లేవారు.కానీ అక్కడ ఒక రాగి చెట్టు  మీది ఉన్న బ్రహ్మ రాక్షసి  ఆ ప్రసాదాలను స్వామికి సమర్పించకుండా ఆటంకాలు  కలిగిస్తుండడంతో వారు ఎంతో ఆందోళనకు గురై.,ఒకరోజు రాత్రి రాముని ఆలయంలో నిద్రించారు.ఆ రాత్రి వారికి ఆంజనేయస్వామి  కల లో ప్రతిక్ష్యమై,  తాను సమీప గ్రామంలో ఉన్నానని.తనను ఇక్కడకు తీసుకువచ్చి ప్రతిష్టంచాలని చెప్పడం తో  గ్రామస్థులంతా ఎడ్లుబండ్లు తో  ఆప్రాంతానికి వెళ్లి  అక్కడ తవ్వకాలు  జరిపారు.తవ్వకాలలొ సూందరాకారం  లో తొమ్మిదు అడుగుల ఏక శిల  వీరాంజనేయస్వామి విగ్రహం  బయటపడింది.స్వామి వారూ కలలో  చెప్పిన విధిగా కంటి ముందు సాక్షాత్కారించడంతో  గ్రామస్తుల ఆనందానికి  అంతులేదు. గ్రామ శివారులో కి విగ్రహం చేరుకోవడంతో రావి చెట్టు పై ఉన్న బ్రహ్మరాక్షసి  మంటలో కాలిపోయిందట , బ్రహ్మ రాక్షసిని హతం చేసిన వీరాంజనేయ స్వామి విగ్రహాన్ని రాములోరి   పాదాల ముందు ప్రతిష్టించారు.

ఎప్పటికీ ఎండిపోని  గుండం…

ఆలయం గుట్టపై ఉండటంవల్ల ఎగువ నుంచి వచ్చే మాండవ్య  నది రెండుగా చీలిపోయే ఆలయం ఎదుట మళ్ళీ కలిసిపోతుంది .ఇరువైపులా ఉండే రెండు నదుల్లో నీరు ప్రవేశిస్తే ఆలయం ఉన్న ప్రదేశం ద్వీపకల్పంలో కనిపిస్తుంది. మాండవ్య ముని తపస్సు చేయడం వల్ల ఈ నదికి మాండవ్య నది అని పేరు వచ్చింది. కాలక్రమేణ గా మానేరు నది గా మారిపోయింది. ఆలయంలోకి ఎటు నుండి వచ్చేనా కాలు తడవలిషినదె,ఆవరణలో ఉన్న గుండం ఎప్పటికీ ఎండిపోదు .కరువు వచ్చేనా ,వర్షాలు కురావ కాపోయేన.గుండం లొ నీరు ఎండిపోదు,అందుచేత ఈ గుండం లోని జలాల ను ఏంతో పవిత్రమైననిగా భక్తులు భావిస్తారు,

ఊరంతా అంజన్న,హన్మండ్లు పేర్లు

ఆంజనేయస్వామి ఆటే భీముని మల్లారెడ్డిపేట  ప్రజలు కు ఎనలేని భక్తి, ఏ కష్టంవచ్చిన స్వామి ని వేడుకుంటారు. తమ పిల్లలకు క్షమంగా ఉండాలని కోరుతూ అంజన్న, మారుతి పేర్లు పెడుతారు.దేవుని పేరు స్పందించి  విధంగా పేర్లు ఉన్నవారు వందలు సంఖ్యలో ఉన్నారు.          

భీముని మల్లారెడ్డి పేట గా….

పూర్వం ద్వాపర యుగంలో   పాండవులు ఈ ప్రాంతంలో  కోద్ది రొజులు అరణ్యవాసం చేస్తూ , ఇక్కడ సంచరించినట్లుగా  మల్లారెడ్డిపేట  ప్రాంతంనికి  గుర్తింపు ఉంది. ఆ కాలం లో  పాండవులు  ముఖ్యంగా చిర్ర గోనె అడారాని ప్రసిద్ధి. ఆట అడుతుడగా ఒక్క బండ క్రిందికి చిర్ర వెళ్లి పడిందిట,అగ్రజుడైన  ధర్మ రాజు దానిని తీసుకురావాలని  భీమున్ని  కొరడంతో ,భీముడు బండ ను నెత్తి తో పైకి ఎత్తి చిర్ర ను తెచ్చాడనీ ప్రతీతి. దీనికి నిదర్శనంగా ఓ గుహ ఇక్కడ ఇప్పటికీ  కనిపిస్తుంది. అందువలన మల్లారెడ్డిపేట ను భీముని మల్లారెడ్డి పేట  గా పిలుస్తారు .

అద్భుతమైన శిల్ప కట్టడం…

శ్రీసీతారామాలయం, వెంకటేశ్వర స్వామి, శివుని ఆలయాలు ఉన్నాయి. వీటిని కాకతీయ కాలంలో నిర్మించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. శ్రీసీతారామాలయం ,శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కలిపి ఒకే ప్రహరీ నిర్మించారు. ,అందుబాటులో ఉండే బండ రాళ్ల ను వినియోగించి గుడి రెండంతస్తుల ప్రకారం నిర్మించారు. మొదటి అంతస్తులో ఆలయం చుట్టూ డంగు సున్నంతో రాతి కట్టడంతో నిర్మాణం చేశారు, ఇప్పటికి చెక్కుచెదరకపొలేదు.కనిపించే శిల్ప కళా ఆ నాటి కళా నైపుణ్యాన్ని చాటుతుంది. శ్రీ సీతారాముల విగ్రహాలకు పాదాలకు సమాంతరంగా ఎదురుగా శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయడం విశేషం .

జాతర…   

ప్రతి సంవత్సరం  మాఘ అమావాస్య రోజున    పెద్ద ఎత్తున జాతర సాగుతుంది.ఈ జాతరకు కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల మరియ వివిద  ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. అదే విధముగా శ్రీరామనవమి ,హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు .  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here