సిరిసిల్ల న్యూస్:తంగళ్లపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు సమావేశం నిర్వహించి కేటీఆర్ కి సంపూర్ణ మద్దతు తెలుపుతూ తిర్మాణం చేశారు. గతంలో తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికమని నేడు నియోజకవర్గ అభివృద్ధిని చూసి కేటీఆర్ ఈసారి లక్ష మెజార్టీతో గెలిస్తే మరింత అభివృద్ధి చేస్తారని నమ్మకంతో సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సభ్యులను బి ఆర్ఎస్ రాష్ట్ర నేత చీటీ నర్సింగారావు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల డాక్టర్ అసోసియేషన్ సభ్యులు, ఓనర్లు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.