శాసనసభలోని బి.ఆర్.ఎస్.ఎల్.పిలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

బలగం టీవీ, హైదరాబాద్ : 

  • మాజీ మంత్రి కేటీఆర్

వేలకోట్ల రూపాయల టిడిఆర్ స్కామ్ కి రేవంత్ రెడ్డి కుట్ర అని, రేవంత్ చుట్టూ ఉన్న నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ఆధ్వర్యంలో ఈ కుట్ర నడుస్తుందని తక్కువ రేటుకి టిడిఆర్లు కొనుగోలు చేసి, ఎఫ్ ఎస్ ఐ పై నిబంధనలు విధించి భారీ రేటుకు అమ్ముకోబోతున్నారని రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే టిడిఆర్ లపైన శ్వేత పత్రం విడుదల చేయాల రేవంత్ రెడ్డి బిజెపి కోవర్టుగా పనిచేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీలో బిజెపి కోవర్టులు ఉన్నారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి రేవంత్ గురించేనని బడ్జెట్ తర్వాత 11 ప్రతిపాదనలు పట్టుకొని మోడీని కలిసిన రేవంత్ మీటింగ్ అసలు ఎజెండా వేరే ఉందని శ్రీధర్ బాబు ని బయటకు పంపించి ప్రధానమంత్రి తో రేవంత్ ఏం మాట్లాడడో బయట పెట్టాలని 15 నెలలుగా బిజెపితో కలిసి పని చేస్తున్న రేవంత్ తెలంగాణకు తెచ్చింది ఏమిటో చెప్పాలని అన్నారు.

బీసీ రిజర్వేషన్ల పైన చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి చచ్చేదాకా ఆమరణ నిరాహార దీక్ష ఢిల్లీలో చేయాలని రేవంత్ రెడ్డి దీక్ష నుంచి పారిపోకుండా తెలంగాణ బిడ్డలు అంతా కాపలాగా ఉంటారని ఎన్నికల్లో సీట్ల కేటాయింపు నుంచి మొదలుకొని డిక్లరేషన్ల అమలుదాకా అన్నింట్లో బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుందని కాంగ్రెస్ పార్టీనే బిజెపి కాంగ్రెస్ లకి బీసీ రిజర్వేషన్ల పైన చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ అత్యంత సులభమని ప్రజా సమస్యల నుంచి అటెన్షన్ డైవర్షన్ కోసమే కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి దొంగాట అని అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో బిజెపికి ఒరిగింది శూన్యమని బిజెపి సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువగా ఉంటుందని 15 నెలలుగా రాష్ట్రంలోని ప్రజా సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపైన 6 గ్యారంటీల అమలుపైన పోరాటం చేస్తుంది బిఆర్ఎస్ పార్టీ మాత్రమేనని 15 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం పైన బీజేపీ చేసిన ఒక్క ఆందోళన కార్యక్రమం ఆయన ఉన్నదని కెసిఆర్ అసెంబ్లీకి వస్తారని రేవంత్ రెడ్డి కెసిఆర్ స్థాయికి ఏమాత్రం సరిపోదని అన్నారు.

దాసోజు శ్రవణ్ వంటి విద్యావంతుడు ఉద్యమకారుడు బీసీ బిడ్డ కు కెసిఆర్ పట్టు పట్టి అవకాశం ఇచ్చారని గతంలో బిజెపి అడ్డుకున్న రెండవసారి అవకాశం ఇచ్చి కెసిఆర్ గారు మాట నిలబెట్టుకున్నారని మొన్నటి మూడు ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు కాంగ్రెస్ కు చెంపపెట్టని,రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేసే అంశం పైన దృష్టి పెట్టాలని రానున్న బడ్జెట్ సమావేశాలలో ఏమీ ఉండదు…అవే అబద్ధాలు, అటెన్షన్ డైవర్షన్లు తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదని అన్నారు. తాము ఇచ్చే బడ్జెట్ డొల్ల కాబట్టి రానున్న 15 రోజుల్లో మరోసారి తెరపైకి ఫార్ములా ఈ అంశాన్ని తీసుకువచ్చి అటెన్షన్ డైవర్షన్ చేయబోతున్నదని,రాష్ట్రంలో కాలం తెచ్చిన కరువు కాకుండా కాంగ్రెస్ తెచ్చిన కరువు ఉన్నదని నా తెలంగాణ తర్వాత దేశంలో ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందాలి… తెలంగాణ తర్వాత ఉండాలి అని అనుకుంటే అది ఏపీ మాత్రమేనని తెలంగాణ పరిశ్రమలు ఏపీకి తరలిపోతున్నాయి అన్న ఉద్దేశంతోనే ఆవేదన వ్యక్తం చేశానని అన్నారు.

ఏపీ అభివృద్ధి చెందితే సంతోషపడతాము, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ వెనుక పడుతుందన్న ఆవేదన ఉన్నదని చంద్రబాబు కూడా కాలేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని ప్రశంసించారని,అయినా రేవంత్ రెడ్డికి కాళేశ్వరం అంశం తెలియదని పూర్తిస్థాయి డీటెయిల్ పాయింట్స్ కింద ఉన్నాయి ఉపయోగించుకోగలరని అన్నారు. రేవంత్ రెడ్డి వేలకోట్ల టిడిఆర్ భారీ స్కాం కి తెర లేపుతున్నాడని రేవంత్ రెడ్డి వెనక నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నారని ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ తీసుకు వచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని,టీడీఆర్ ఎక్కడెక్కడ ఉన్నయో ఆయన చుట్టూ ఉన్న నలుగురు బ్రోకర్లు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వందల వేల కోట్ల కుంభకోణానికి నలుగురు బ్రోకర్లతో సీఎం రేవంత్ రెడ్డి తిరుగుతున్నారని రేవంత్ రెడ్డి త్వరలో హైదరాబాద్ నగరంలో ఎఫ్ ఎస్ ఐ పైన పరిమితులు విధించబోతున్నాడు. ఆలోగా హైదరాబాదులో ఉన్న టి డి ఆర్ హక్కులను రేవంత్ రెడ్డి ముఠా కొనుగోలు చేస్తుంది. ఇప్పుడు అతి తక్కువ రేట్లకు కొని ఎఫ్ ఎస్ ఐ పరిమితి విధించగానే డిమాండ్ పెంచి అవి టిడిఆర్ లని అత్యధిక రేటుకి అమ్ముకోబోతున్నాడని అన్నారు.

ఇది ముమ్మాటికి ఇన్సైడర్ ట్రేడింగ్ వంటి భారీ నేరం. సిబిఐ ఈడి వంటి సంస్థల దర్యాప్తుకు తగిన భారీ స్కాం అని,రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే నేను చేస్తున్న ఆరోపణ నిజం కాదు అని అంటే…ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో టిడిఆర్లు ఎవరి వద్ద పోగుపడుతున్నాయో…ఎవరు అడ్డగోలుగా కొనుగోలు చేశారు అనే అంశం పైన శ్వేత పత్రం విడుదల చేయాలని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో భారీగా భవనాలు రావడం వలన నగర అభివృద్ధికి ఇబ్బంది అవుతుందని చెప్పి… ఈ సాకుతో ముఠా కొనుగోలు చేసిన టిడిఆర్ లను అడ్డగోలు రేట్లకి బిల్డర్లకు అమ్మే కుట్రకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడని,ఎఫ్ ఎస్ ఐ పైన పరిమితులు లేకుండా ఉండే విధానానికి గతంలో వైయస్సార్ సారాధ్యంలోని కాంగ్రెస్ పార్టీని విధానపరమైన నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా మేము కొనసాగించాము. కానీ రేవంత్ రెడ్డి ఎస్ ఎస్ ఐ పైన పరిమితులు విధించి ఆ నెపాన్ని గత ప్రభుత్వం పైకి నెట్టి… తాను కొనుగోలు చేసిన టిడిఆర్ లను అత్యధిక రేట్లకు అమ్మే స్కాం పైన త్వరలో ప్రకటన రాబోతున్నదని అన్నారు.

ఈ టి డి ఆర్ పద్ధతిలో వేలకోట్ల రూపాయల విలువైన 400 ఎకరాల భూములను ప్రజా అవసరాల కోసము ప్రజల నుంచి జిహెచ్ఎంసి సేకరించింది. గొప్ప ఉద్దేశంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లకుండా పౌరులకు ఎంతగానో ఉపయోగపడే ఈ విధానాన్ని కూడా రేవంత్ రెడ్డి తన అక్రమ సంపాదనకు ఒక మార్గంగా ఎంచుకున్నాడని,రేవంత్ రెడ్డి బిజెపి కోవర్ట్ గా పనిచేస్తున్నాడని అన్నారు. కాంగ్రెస్ లో బిజెపి కోవర్టుగా పనిచేస్తున్నారని అందరికీ తెలుసు. అందుకే రాహుల్ గాంధీ తాజాగా రాజస్థాన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారని అన్నారు. తాజాగా రాహుల్ గాంధీ మా పార్టీలో బిజెపి కోవర్టులు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా రేవంత్ రెడ్డి గురించేనని రేవంత్ రెడ్డి మాట ఢిల్లీ లో నడవటం లేదు.. కాంగ్రెస్‌లో బీజేపీ కోవర్టులు ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారని,అందుకే రేవంత్ రెడ్డి చెప్పిన ఎవరికీ కూడా ఎమ్మెల్సీ ఇవ్వలేదని, తన సొంత వ్యక్తులకు పదవులు ఇచ్చుకోలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాడని అన్నారు. పదవీపీఠం అయినది అయిన పెత్తనం మొత్తం కాంగ్రెస్ అధిష్టానందేనని.. ఇప్పటిదాకా పూర్తిస్థాయి క్యాబినెట్ ని కూడా ఏర్పాటు చేసుకోలేని నిస్సాయ స్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నాడని రేవంత్ రెడ్డిని చూస్తే జాలి వేస్తుందని అన్నారు.

బలమైన ప్రాంతీయ పార్టీల నేతలను తొక్కడమే జాతీయ పార్టీల ఎజెండాని మీ ముందు నుంచి చెప్తున్నాము అందుకే కెసిఆర్ మమతా బెనర్జీ స్టాలిన్ వంటి నాయకులను కేంద్రం ఇబ్బందులు పెడుతుందని,ఇతరులకు పదవులు ఇచ్చుకోలేకపోతున్నాడు కానీ ఆయన బాగానే పైసలు వెనకేసుకుంటున్నాడని దేశ చరిత్రలో అవినీతి మార్గంలో డబ్బులు సంపాదించడానికి అత్యధిక మార్గాలు తెలిసింది రేవంత్ రెడ్డి మాత్రమేనని రేవంత్ రెడ్డి పాలనలో ఆయన దోపిడీ పెరిగింది కానీ ప్రభుత్వ ఆదాయం తగ్గిందని ఇండియా టుడే సదస్సులు రేవంత్ రెడ్డి తనని బయటపెట్టుకున్నాడని ఎన్నికల ప్రచారం అప్పుడు అడ్డగోలుగా అన్ని తెలుసు మాకు అనుభవం అన్ని ఉన్నాయని చెప్పిన సన్నాసులు ఈరోజు అప్పుల పేరు చెప్పి రోజు అబద్దాలు ఆడుతున్నారని అన్నారు.

ఆరు గ్యారెంటీలకు అవసరమైన నిధులు ఎట్లా తేవాలో తెలుసు అని చెప్పిన వాళ్లే ఈ రోజు తమ చేతకానితనాన్ని బయట పెట్టుకుంటున్నారని రాష్ట్రానికి డబ్బులు రావడం లేదు గాని ముఖ్యమంత్రి కి మాత్రం బాగానే వస్తున్నాయనిఅందుకే ఆయనది నడవటం లేదని ఎక్కే విమానం దిగె విమానం తప్ప చేసేది ఏమీ లేదని కేంద్రంతో సత్సంబంధాలు ఉండకపోవడం వల్లనే తెలంగాణ అభివృద్ధి చెందలేదు అని చెప్పిన రేవంత్ రెడ్డి మరి 15 నెలల్లో ఢిల్లీకి వెళ్లి ఏమి చేశారని చెప్పాలని, 15 నెలల్లో తెచ్చిన ఒక్క ముఖ్యమైన ప్రాజెక్టు కానీ పథకం కానీ నిధులు కానీ ఉన్నాయా చెప్పాలని అన్నారు. కేవలం లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసమే ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్తున్నాడని రేవంత్ రెడ్డి బడ్జెట్ అయిపోయిన తర్వాత అర్థం లేకుండా 11 అంశాలతో ప్రధానమంత్రిని కలిసిన అంటున్నాడని అన్నారు.

ప్రధానమంత్రితో రేవంత్ రెడ్డి సమావేశం వెనుక వేరే ఎజెండా ఉన్నదని మంత్రి శ్రీధర్ బాబును బయటకు పంపించిన తర్వాత ప్రధానమంత్రి మోడీ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుకున్నారో చెప్పాలని మోడీ మంచోడు అనకపోతే జైల్లో వేస్తాడని.. కిషన్ రెడ్డి ఆ పని చేయలేడు కదా అని.. ఆయన నిస్సహాయుడని అన్నారు.రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ఒకే తాను ముక్కలు.. ఇద్దరూ కలిసి దొంగాట ఆడుతున్నారని.. ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఒకరిపై ఒకరు విమర్శించుకుంటున్నారు.. ఇదంతా అటెన్షన్ డైవర్షన్లో భాగమేనని అన్నారు.

రేవంత్ రెడ్డి వరంగల్ ఎయిర్పోర్ట్ క్రెడిట్ తీసుకోవాలని చూస్తున్న ప్రజలకి తెలుసు …దానికోసం కృషి చేసిన వాళ్లనే ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. మా హయాంలో వరంగల్ ఎయిర్పోర్ట్ తో పాటు మరో ఆరు ఎయిర్పోర్టులకి ప్రతిపాదనలు కేంద్రానికి పంపామని వరంగల్ ఎయిర్ పోర్ట్ కోసం ముందు పడి కృషి చేసింది మేము, కానీ వాళ్ళు పేరు పెట్టుకుంటున్నారని ముఖ్యమంత్రికి చేతనైతే వేగంగా ఎయిర్పోర్టును పూర్తి చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు.15 నెలల రేవంత్ రెడ్డి పాలన అసమర్థుడు జీవయాత్ర మాదిరి నడుస్తున్నది. 15 నెలల్లో అన్ని రంగాల్లో విపులమైన రేవంత్ రెడ్డి పరిపాలన నడపలేక చతికిలపడ్డాడు. తెలంగాణకు వచ్చిన పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ కి పాల్పడుతున్నాడని అన్నారు.30% కు పైగా కమిషన్ లతో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. కాంట్రాక్టర్లు బిల్డర్లు ప్రతి ఒక్కరు ఈ అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. సచివాలయం దాకా వచ్చి కాంట్రాక్టర్లు ధర్నా చేసే పరిస్థితి గతంలో ఇప్పుడైనా ఉన్నదా అని, రాష్ట్రంలో కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు ఏర్పడిందని ఎండలు కొట్టడం వల్ల పంటలు ఎండిపోతే నన్ను తిడుతున్నారంటూ రేవంత్ రెడ్డి మంత్రి లేకుండా మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి పుట్టక ముందు నుంచి కూడా ఎండలు ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేకనే పంటలు ఎండుతున్నాయి. రేవంత్ రెడ్డి కాళేశ్వరమైన పగ పట్టి ఎండబెట్టడం వల్లనే పంటలు ఎండిపోతున్నాయి. కాలేశ్వరం కి మరమ్మత్తులు చేసి ఉండి ఉంటే గోదావరి పరివాహక ప్రాంతం పచ్చగా ఉండేది. స్వయంగా సాగునీటి శాఖ మంత్రి నియోజకవర్గంలోనే పంటలు ఎండిపోతున్న ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాలేశ్వరం ప్రాజెక్టు విలువ కరువు వచ్చిన రోజే తెలుస్తుంది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు. అందుకే ఈరోజు కాలేశ్వరం నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు చూసినప్పుడు ఆవేదన కలుగుతుంది. కాలేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం గురించి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడిన రేవంత్ రెడ్డికి మాత్రం సిగ్గు రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు సైతం ఎండిపోయి తీవ్రమైన తాగునీటి సాగునీటి కొరత ఏర్పడిందని అన్నారు.

తాజాగా ముగిసిన గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పైన,పార్టీపరంగా ఒక నిర్ణయం తీసుకొని ఎన్నికల్లో పాల్గొనలేదు. అదే సమయానికి స్థానిక సంస్థల ఎన్నికలు, పది స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయి కాబట్టి వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కానీ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడానికి భయపడి వాయిదా వేసుకుని పారిపోయిందని ఈ ఒక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితంతో ఒరిగేది ఏమీ ఉండదు. ఈ ఎన్నికల్లో విజయంతో బిజెపి సంబరపడిన…ఆ పార్టీకి వచ్చేది ఏమీ ఉండదని బిజెపి సోషల్ మీడియాలో ఎక్కువ సోసైటీలో తక్కువగా ఉంటుందని 15 నెలల కాలంలో ప్రతి అంశం పైన ప్రజా పోరాటాలు చేసింది మా పార్టీనే…బిజెపి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ ల పైన గాని రైతన్నల కష్టాల పైన గాని కృష్ణా జలాల పైన కానీ ఏ రోజు ఒక్క మాట కూడా మాట్లాడలేదని రాష్ట్రంలో కాంగ్రెస్ బిజెపి కలిసి పని చేస్తున్నాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి చెంప దెబ్బ అని, 50 వేల ఉద్యోగాలు మేము ఇచ్చాము అది నిజమైతేనే ఓటు వేయండి అన్న రేవంత్ రెడ్డి మాటలకు గ్రాడ్యుయేట్లు చెంప దెబ్బ కొట్టినట్లు తమ ఓటు ద్వారా నిర్ణయాన్ని వ్యక్తపరిచారని అన్నారు. ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోసం ప్రచారం చేసిన ఏకైక బలహీనమైన సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు. అంత చేస్తే మూడు స్థానాల్లోనూ ఓటమి మూటగట్టుకుని కేవలం 15 నెలల్లోనే తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది కాంగ్రెస్ పార్టీ అని,ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత అయినా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలపైన వాటి అమలుపైన దృష్టి సారిస్తే మంచిదని అన్నారు.

దాసోజు శ్రవణ్ కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం పైన.. – కేటీఆర్

శ్రవణ్ ను 2023 లో నామినేట్ చేశామని అప్పుడు బీజేపీ ఆపిందని, బిజెపి ఆపిన కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు మరొకసారి శ్రవణ్ కి అవకాశం ఇవ్వడం జరిగిందని, నిన్నటి నుంచి దాసోజు శ్రవణ్ అభ్యర్థిత్వం పైన 100% సానుకూలమైన స్పందన సమాజంలోని అన్ని వర్గాల నుంచి వచ్చింది. విద్యావంతుడు ఉద్యమకారుడు బీసీ బిడ్డను బిజెపి అడ్డుకునే ప్రయత్నం చేస్తే రెండవసారి పట్టు పట్టి అవకాశం ఇచ్చి శాసనమండలికి పంపి గౌరవించుకుంటుంది కేసీఆర్ బిఆర్ఎస్ మాత్రమే. అందుకే కేసిఆర్ మళ్ళీ గుర్తించి అవకాశం ఇచ్చారని అన్నారు.

ఎమ్మెల్యేల భేరసారాలకు అవకాశం ఇవ్వకూడదని ఉద్దేశంతోనే అదనపు అభ్యర్థిని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలపలేదని గతంలో కాంగ్రెస్ చేసినట్లుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి పదవులు దక్కించుకోవాలని దుర్మార్గపు ప్రయత్నం మా పార్టీ విధానం కాదని, అందుకే ప్రస్తుత రాజకీయ పరిణామాలు సభలో ఉన్న బలాల మేరకు ఒక అభ్యర్థిని నిలిపామని అన్నారు.

అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యే అంశం పైన..– కేటీఆర్

అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారు. గవర్నర్ ప్రసంగం రోజున కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారని కేసీఆర్ స్థాయి వేరు అని, ఆయన స్థాయికి కాంగ్రెస్ నేతలు సరిపోరని అన్నారు. వీళ్లు మాట్లాడే మాటలు, పనికి మాలిన మాటలు వినాల్సిన అవసరం లేదని అనేది ఒక కొడుకుగా కార్యకర్తగా నా వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. బడ్జెట్ సమావేశాల నుంచి దృష్టి మరలచేందుకు మరోసారి ఫార్ములా ఈ అంశంలో నోటీస్ ఇస్తుందని అన్నారు.రానున్న బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఏమీ ఉండదు కాబట్టి ఈ అంశం పైన చర్చ జరగకుండా అటెన్షన్ డైవర్షన్ కోసం మళ్లీ ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మళ్ళీ నోటీసులు ఇస్తారని 16 బడ్జెట్ పెట్టీ,17 నోటీసులు ఇచ్చి మళ్ళీ పిలుస్తారు. అసెంబ్లీ సమావేశాలలో గానే నోటీసుల నాటకానికి గవర్నమెంట్ తెరలేపుతుంది. ఇది ముమ్మాటికీ లొట్టపీసు కేసు అని అన్నారు.

ఈ కార్ రేస్ కేసు వల్ల ఏం లాభం జరిగిందో నేను చెప్తా… కానీ 200 కోట్ల రూపాయలతో రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న అందాల పోటీ వలన లాభం ఏంటిదో చెప్పాలి. 200 కోట్ల రూపాయలతో రేవంత్ రెడ్డి రెండు రోజులు ఫోటోలు దిగవచ్చు. దీని ద్వారా తెలంగాణకు హైదరాబాద్ నగరానికి వచ్చి ఆర్థిక ప్రయోజనం ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయమేమిటో రేవంత్ రెడ్డి చెప్పాలి. గతంలో నేను నిర్వహించిన ఫార్ములా ఈ వలన వేలకోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయని అన్నారు. గతంలో 46 కోట్లతోని ఫార్ములా నిర్వహిస్తే అవినీతి అంటూ, కేసులు అంటూ మాట్లాడిన రేవంత్ రెడ్డి మరి 200 కోట్లు పెట్టీ ప్రపంచ సుందరి పోటీలు పెడుతున్నారని ఈయన పైన ఏం కేసులు పెట్టాలని అన్నారు. దీనివల్ల లాభం ఏంటి.. 46 కోట్ల రూపాయలతోని ఫార్ములా ఈని నిర్వహిస్తేనే సహించలేని ఈ మొగోడు ఒలింపిక్స్ పెడుతానంటున్నాడు దానికి లక్ష కోట్లు కావాలని ఈ అంశం పైన ఆయనకు అవగాహన లేదని అన్నారు.

బీసీల రిజర్వేషన్ అంశం పైన చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేయాలని,బీసీల రిజర్వేషన్ అంశం పైన కాంగ్రెస్ పార్టీది ప్రతిసారి అవకాశవాద వైఖరినే అని,ఎన్నికల్లో భారీగా సీట్లు ఇస్తామని కనీసం 20 అసెంబ్లీ స్థానాలకు కూడా బీసీలకు అవకాశాలు ఇవ్వలేదని ఎన్నికలు ముగిసిన తర్వాత సాధ్యం కానీ విధంగా రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ వ్యవహరిస్తుందని కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి మోడీ అనుకుంటే 42% రిజర్వేషన్ కోసం రాజ్యాంగ సవరణ ఒక్క నిమిషంలో అయిపోతుందని,బిజెపి కాంగ్రెస్ పార్టీలకు బీసీలకు రిజర్వేషన్లు రావద్దు అని ఉందని, అందుకే ఆ రెండు పార్టీలు రాజ్యాంగ సవరణ అంశం పైన మాట్లాడటం లేదని అన్నారు.

రేవంత్ రెడ్డి నిజంగానే బీసీల 42 శాతం రిజర్వేషన్ పైన చిత్తశుద్ధి ఉంటే చనిపోయేదాకా ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేయడం ద్వారా రిజర్వేషన్లు సాధించుకోవాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రేవంత్ రెడ్డి దీక్ష చేస్తే రాష్ట్రంలోని బీసీ బిడ్డలందరికీ కలుపుకొని ఆయన పారిపోకుండా కావలి ఉంటామని అన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో దీక్ష చేస్తే సంచలనంగా మారుతుందని అందుకే ఢిల్లీలో రేవంత్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలని అన్నారు.

మా పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే బీసీలకు రిజర్వేషన్లను పెంచే అంశంతో పాటు కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేయడం అనే అంశాల పైన తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించడం జరిగిందని,రాహుల్ గాంధీ నిద్రలేవకముందే జనాభా లెక్కల్లో కులగన జరపాలని తీర్మానం చేసి పంపించామని,మొన్నటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా బీసీ బిడ్డలకు అవకాశం ఇచ్చామని ఇతర పార్టీలకు బిసి రిజర్వేషన్ల అంశం బిసి అభివృద్ధి అనేది ఓట్ల రాజకీయమైతే.. ఈ అంశం లో మరి చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం, ఇవే మా పార్టీ విధానాలని అన్నారు.

Recent Articles

spot_img

Related Stories

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Stay on op - Ge the daily news in your inbox

Jeetwin

Jeetbuzz

Baji999

sekabet girişSekabetSekabetSekabet GirişSekabet Güncel GirişSekabetSekabetSekabet GirişSekabet Güncel Giriş sekabet giriş Sekabet Sekabet Sekabet Giriş Sekabet Güncel Giriş Sekabet Sekabet Sekabet Giriş Sekabet Güncel Giriş