-కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్
బలగం టీవి ,తంగళ్లపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో సిరిసిల్ల నేతన్నల సంక్షోభానికి కారణం మాజీమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ కారణమని మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ ఆరోపించారు.ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సిరిసిల్ల నేత కార్మికులకు చేయని న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వంతో యుద్ధం చేసి బకాయిలు తెప్పిస్తానని హామీలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఇక్కడ నేత కార్మికులకు బతుకమ్మ చీరల పేరుతో ప్రభుత్వం ఆర్డర్లు ఇప్పించి చేనేత రంగాన్ని అభివృద్ధి చేస్తున్నమని చెప్పి కమిషన్లు దోచుకోవడానికి కొత్త పథకాలు ఎమ్మెల్యే కేటీఆర్ తీసుకువచ్చారని బతుకమ్మ చీరల ఉపాధితో కేవలం నాలుగు నెలలు మాత్రమే పని దొరికి మిగతా నెలలు కార్మికులు పస్తులు ఉండే విధంగా సిరిసిల్లను మార్చారని తెలిపారు.మ్యాక్స్ సొసైటీల పేరుతో ఎన్నో కోట్లు దోచుకున్నారని ఇప్పటికి చేనేత కార్మికులకు రావలసిన 275 కోట్లు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు.కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి సహకారంతో చేనేత కార్మికులకు రావలసిన బకాయి బిల్లులను అందేలా చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో చుక్క రాజశేఖర్,ఎగుర్ల ప్రశాంత్,బైరినేని రాము,మోర రాజు,మునిగెల రాజు,మోర లక్ష్మీరాజం,గణేష్,సత్తు శ్రీనివాస్ రెడ్డి,ముక్క వాసు, తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.