బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి, అశ్విని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దమ్మన్నపేట మాజీ ఎంపీటీసీ (MPTC) అంబర్ నాయక్ ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు.
బుధవారం ఆసుపత్రికి చేరుకున్న కేటీఆర్, అంబర్ నాయక్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. అంబర్ నాయక్‌కు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి సిబ్బందిని కోరారు. త్వరగా కోలుకోవాలని అంబర్ నాయక్‌కు కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు కేటీఆర్‌తో పాటు ఆసుపత్రికి వచ్చారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు.


