వేములవాడ సీనియర్ రిపోర్టర్ దాసరి దేవేందర్, వారి కుటుంబానికి కేటీఆర్ పరామర్శ..

0
681

వేములవాడ సీనియర్ రిపోర్టర్ దాసరి దేవేందర్ కు పితృవియోగం.. సిరిసిల్లలో కేటీఆర్ పరామర్శ

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) వేములవాడ సీనియర్ రిపోర్టర్ దాసరి దేవేందర్ ను మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సీనియర్ రిపోర్టర్ దాసరి దేవేందర్ కు పితృవియోగం.. కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో సిరిసిల్ల టౌన్, వెంకంపేట్‌లో ఉన్న దేవేందర్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. దేవేందర్ తండ్రి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కష్టకాలంలో ఆయన కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని, వారికి భరోసా కల్పించారు. కేటీఆర్ వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here