బలగం టీవీ, హైదరాబాద్ :
మెదక్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మేకల నర్సింగ్‌రావుకు పార్టీ సంపూర్ణ భరోసా ఇస్తుందని, అండగా నిలుస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. మెదక్ స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తన చిన్న వయస్సును మరచి మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ పై చేసిన అడ్డగోలు వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానం ఇచ్చిన నర్సింగ్‌ను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. నర్సింగ్ లాంటి నిబద్ధత కలిగిన పదిమంది కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో ఉంటే కాంగ్రెస్ కుట్రలు సాగవన్నారు. నర్సింగ్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సీఐ, పోలీస్ సిబ్బందిని వదిలిపెట్టేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. వీరిని గుర్తుపెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు మీద కేసుల నమోదుతో పాటు క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. థర్డ్ డిగ్రీ వల్ల నర్సింగ్‌కు జరిగిన గాయాలకు తగిన వైద్య సహాయం పార్టీ అందిస్తుంది, నర్సింగ్ మరియు ఆయన కుటుంబానికి పూర్తి అండగా నిలుస్తాం అని కేటీఆర్ భరోసా ఇచ్చారు.