బలగం టీవి , తంగళ్ళపల్లి
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి కేటీఆర్ ను తంగళ్ళపల్లి మండలం గండి లచ్చపేట గ్రామానికి చెందిన బండి దేవేందర్ యాదవ్
మర్యాదపూర్వకంగా కలిసి తిరుపతి లడ్డు ప్రసాదం అందజేశారు. కేటీఆర్ ఐదవ సారి సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలవడంతో బండి దేవేందర్ యాదవ్ ఇటీవల తిరుపతి వెళ్లి మొక్కు చెల్లించుకొని లడ్డు ప్రసాదాన్ని తీసుకొని వచ్చి కేటీఆర్ కి అందజేశారు.ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని అందజేసిన దేవేందర్ కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మోతే మహేష్ యాదవ్,ఆత్మకూరు చంటి యాదవ్ లు కలిశారు