8వేల జనసముహాంతో పద్మశాలీ సంఘ నేత లగిశెట్టి నామీనేషన్2 వేల ఓట్లు రావని కామేంట్ చేసిన నేతల ముందే 8వేల మందితో బారి ర్యాలీ
మేజార్టీ ఓట్లున్న సామాజికి వర్గం నుంచి ఇద్దరు బరిలో..
అయోమయంలో బీఆర్ఎస్ శ్రేణులు.. లక్షా మేజార్టీపై తర్జన భర్జన
పగబట్టి బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లెలా చూసిన సిరిసిల్ల నేతలు
రాజకీయ పదవులకు అడ్డోస్తడనే నెపంతో సిరిసిల్ల ముఖ్య నేతల కుట్ర
పథకం ప్రకారమే మంత్రి కేటీఆర్‌కు లగిశెట్టిని దూరం చేసిన ముఖ్య నేతలు
బీఆర్ఎస్కు రాజకీయ సంకటంగా మారిన లగిశెట్టి శ్రీనివాస్
సిరిసిల్ల న్యూస్:

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రతినిధ్య వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో రాజకీయంగ పెను మార్పులు జరుగుతున్నాయి. మంత్రి కేటీఆర్‌ను సొంత పార్టీ నాయకులే పుట్టి ముంచుతున్నరన్న చర్చ కొనసాగుతుంది. సిరిసిల్ల రాజకీయాలపై సమయం కేటాయించకుండా మంత్రి కేటీఆర్ హైదరాబాద్ కే పరిమితం కావడంతో సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. మంత్రి కేటీఆర్‌కు అభిమానులుగా.. శ్రేయోభిలాషులుగా ఉన్నవారంత దూరమవుతు వస్తున్నారు. బీఆర్ఎస్ క్యాడర్ లో చీలికలు ఏర్పడ్డాయి. డబ్బులు ఇస్తే కానీ పని చేయని ప్రజాప్రతినిధులు తయారయ్యన్న విమర్శలు వినవస్తున్నాయి. పద్మశాలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, సిరిసిల్ల సెస్ మాజీ వైస్ చైర్మన్, సామాజిక సేవకులు లగిశెట్టి శ్రీనివాస్ బారి జనసమీకరణతో.. సిరిసిల్ల ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసేందుకు నామీనేషన్ వేశారు. సిరిసిల్ల పద్మశాలీ సమాజం నుంచి సూమారు 8 వేల మందికి పైగా ఈ నామీనేషన్ కార్యక్రమానికి హజరయ్యారు. సిరిసిల్ల మంచి పేరున్న లగిశెట్టి శ్రీనివాస్ వ్యాపారవేత్తగా.. సామాజిక సేవకులుగా.. వందల మందికి పుస్తె మట్టెలు, ఆర్థిక సాయాలు అందించిన వ్యక్తిగా సుపరిచితులు. బీఆర్ఎస్ లో చేరిన లగిశెట్టి శ్రీనివాస్ అనతికాలంలోనే సెస్ వైస్ చైర్మన్‌గా ఎదిగి మంచి పేరు సంపాదించుకున్నాడు. బీఆర్ఎస్ ప్రస్తుతం రాష్ట్ర స్థాయి నామీనేట్ పోస్టులో కొనసాగుతున్న వ్యక్తికి లగిశెట్టికి రాజకీయంగా వైరం ఏర్పడి.. పార్టీకి దూరంగా ఉంటు వచ్చాడు. ఈ వివాదంపై మంత్రి కేటీఆర్ కూడా పట్టించుకోకపోవడం.. రెండేళ్లు పార్టీకి దూరంగా ఉన్న కూడా పార్టీ నాయకులు కార్యక్రమాలకు ఆహ్వనించకపోవడంతో మనస్థాపం చెందిన లగిశెట్టి శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపిలో చేరారు. మంత్రి కేటీఆర్ పలుసార్లు లగిశెట్టి శ్రీనివాస్ తో మాట్లాడి బుజ్జగించాలని పార్టీ శ్రేణులుకు ఆదేశించిన స్థానిక నాయకులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా.. మంత్రి కేటీఆర్‌కు లగిశెట్టి శ్రీనివాస్ పై తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు లగిశెట్టి తానంతట తానే పార్టీ నుంచి బయటకు వెళ్లెలా ప్రణాళిక బద్దంగా చేశారు. తనను రెండు ఏళ్లుగా పట్టించుకోకపోవడమే కాకుండా తన కొడుకు కరోనా సమయంలో వేరే దేశం ఎయిర్‌పోర్టులో చిక్కుకుంటే మంత్రి కేటీఆర్ స్పందించలేదని మనస్థాపం చెంది ఏకంగా బీజేపి పార్టీలో చేరి ఎమ్మెల్యే పోటీ చేసేందుకు సిద్దమయ్యారు.బీజేపి పార్టీ కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో భంగపడ్డ లగిశెట్టి శ్రీనివాస్ బీజేపి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే ఎన్నికల బరిలో ఉన్నారు. మంత్రి కేటీఆర్ మేనభావ చీటీ నర్సింగరావుకు వ్యాపార భాగస్వామిగా.. అతి సన్నిహితుడిగా ఉన్న లగిశెట్టి ఏకంగా మంత్రి కేటీఆర్ పైనే పోటీ చేయడం సిరిసిల్ల లో తీవ్ర చర్చనీయంశంగా మారింది. సిరిసిల్ల అతిపెద్ద ఓటు బ్యాంకు ఉన్న సామాజిక వర్గం పద్మశాలీయుల తరుపున ఈ సారి లగిశెట్టి శ్రీనివాస్ తో పాటు సిరిసిల్ల లో అనతికాలంలోనే యూత్ ఫాలోయింగ్ సంపాదించి..ఆధ్యాత్మీక కార్యక్రమాలతో సిరిసిల్ల పట్టణ జనంను ఆకట్టుకున్న పత్తిపాక సురేష్ కూడా ఎమ్మెల్యే ఎన్నికల బరిలో ఉంటున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్కు ఉన్న ఓటు బ్యాంకు మైనస్ అయ్యేలా కనిపిస్తుంది. సిరిసిల్ల లో లక్షా మేజార్టీ సంపాదించి మంత్రి కేటీఆర్ ఈ సారి మేజార్టీలో రికార్డు సృష్టించాలని చూస్తున్నారు.

కానీ సిరిసిల్ల పద్మశాలీ సమాజంలో మంచి పేరున్న బలమైన నాయకులు లగిశెట్టి శ్రీనివాస్, యూత్ నాయకుడు పత్తిపాక సురేష్ తో పాటు మరో పక్కా బీజేపి నుంచి ఫైర్ బ్రాండ్ రాణి రుద్రమ రోజుకో ఆరోపణతో బీఆర్ఎస్పై, మంత్రి కేటీఆర్‌పై మీడియా ముఖంగా విరుచకుపడుతుంది. తెలంగాణా ఉద్యమనాయకుడు కేకే మహేందర్ రెడ్డికి కూడ ఈ సారి కాంగ్రెస్ గ్రాప్ పెరగడంతో ఓటు బ్యాంకు పెరిగుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు లగిశెట్టి శ్రీనివాస్‌ను కాపాడుకుంటే బాగుండని బీఆర్ఎస్కు నష్టం చేసే నాయకులు పార్టీలో ఉన్నారని, పార్టీకి పనికివచ్చే నాయకులు బయట ఉన్నరని బీఆర్ఎస్ లోనే చర్చ కొనసాగతుంది. సిరిసిల్ల లో రాష్ట్ర స్థాయి నామీనేట్ ఇచ్చిన నాయకుడి చేష్టలతో బీఆర్ఎస్ పార్టీ పరువు ఆ సామాజిక వర్గంలో సన్నగిల్లింది. పార్టీ ప్రమాణ స్వీకార సమయంలో చందాల రూపంలో లక్షల రూపాయలు వసూలు చేసి పత్రికల్లో ఈ విషయం రావడంతో మంత్రి కేటీఆర్‌కు, బీఆర్ఎస పార్టీ ప్రతిష్ట దెబ్బతింది. సిరిసిల్ల పట్టణంలో మేజార్టీ సమాజం ఈ నాయకుడి తీరును వ్యతిరేఖిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి సిరిసిల్ల పట్టణంలో ఓ బ్యాంకుపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నయని రాజకీయ చర్చ కొనసాగుతుంది. బీఆర్ఎస్ నాయకులు వరుస వివాదాల్లో చిక్కుకోవడం.. పలు సామాజిక వర్గాల వారిని కించపరిచేలా మాట్లాడటం.. దూషించడం సిరిసిల్ల పట్టణంలో తీవ్ర వివాదస్పదమైంది. ఇప్పటికి చర్చ కొనసాగుతుంది. దీనికి తోడు గల్ఫ్ సమస్యలు పరిష్కరించడం లేదని గల్ఫ్ జేఏసి తరుపున సిరిసిల్లలో దొనికిని కృష్ణ పోటీ చేస్తున్నారు. గల్ప్ వలస కుటుంబాల ఓట్లు బీఆర్ఎస్ వేయవద్దని, ఏకంగా వారి సంఘాల్లో ఏకగ్రీవ తీర్మాణలు చేసుకోని గల్ప్ దేశాల నుంచి వారి కుటుంబ సభ్యలతో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఏది ఏమైన సిరిసిల్లలో పద్మశాలీ సామాజికవర్గం నుంచి ఇద్దరు పోటీ చేస్తుండటంతో బీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం పడనుంది.
