బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
- సిద్దిపేట ఇరిగేషన్ ఏఈ ఫిర్యాదుతో చిన్నకోడూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
- అన్నదాతకు అందని నీరు.. నీటి కోసం తాపత్రయం..
మండలంలోని రైతుల పోలాలు ఎండిపోకుండా నీళ్లు అందించాలని తాపత్రయంతో జక్కాపూర్ శివారు నుండి దాచారం రామచంద్రపూర్ బాణప్ప చెరువు మీదుగా ఎల్లమ్మ చెరువుకు నీళ్ల కోసం జక్కపూర్ కెనాల్ దగ్గర కాలువకు గండి కొట్టినందుకు రైతులపై సిద్దిపేట ఇరిగేషన్ ఏఈ ఫిర్యాదుతో చిన్నకోడూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. రైతుల పొలలు ఎండిపోకుండా వుండడానికి ఎన్ని కేసులు పెట్టిన భయపడే ప్రసక్తే లేదని రైతులు తెలిపారు. మండలానికి చెందిన బైరినేని రాము మాజీ ఎంపీటీసీ,శ్రీరాముల వెంకటేష్,బత్తుల మహేష్,మేకల బాలయ్య,గడ్డం సందీప్ రెడ్డి,గజ్జల దేవరాజు,తడకల రమేష్,కట్కూరి ప్రభాకర్,తడకల స్వామి,గడ్డం రమేష్, దరిపెల్లి యాదగిరి , గజ్జల భూపతి,బర్ల రాజు,గంగాపురం రవీందర్, మాట్ల దుర్గయ్య లపై కేసులు చేయడం విడ్డురంగా ఉందని తెలిపారు.