బలగం టీవి, ఎల్లారెడ్డిపేట :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పి ఆర్ ఓ గా నియమితులైన ఎల్లారెడ్డి పేట మండలంలోని నారయణపూర్ కు చెందిన బోల్గం శ్రీనివాస్ గౌడ్ ని హైదరాబాద్ లోని అతడి నివాస గృహంలో టిఎన్జి ఓస్ జిల్లా అద్యక్షులు ఎలుసాని ప్రవీణ్ యాదవ్ ఆధ్వర్యంలో శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు బుగ్గ కృష్ణ మూర్తి,గంట రవి గౌడ్, పర్శరాం రెడ్డి, పాముల స్వామి గౌడ్, ఎల్లారెడ్డి పేట సింగిల్ విండో డైరెక్టర్ గోగురి ప్రభాకర్ రెడ్డి ,షకీల్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ ప్రాంత అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లాలని శ్రీనివాస్ గౌడ్ ను కోరగా తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని ఆయన అన్నారు.