బలగం టివి, బోయినిపల్లి;
ప్రాణాలు పోతే గాని వైర్లు సరి చేయరా?
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సెస్ అధికారులు
ప్రమాదకరం అంచున కరెంటు స్తంభాలు
చూసి చూడకుండా వదిలేస్తున్న సెస్ అధికారులు
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి సబ్ స్టేషన్ నుండి కొదురుపాక వరకు వేములవాడ-కరీంనగర్ ప్రధాన రహదారి వెంబడి నీలోజిపల్లి కొదురుపాక గ్రామాల మధ్య గత సంవత్సరం నుండి 33 కెవి,11 కెవి గల కరెంటు స్తంభాలు ప్రమాదకరంగా ఉన్నాయి. రహదారి వెంబడి మూడు లైన్లు కిందికి వేలాడటంతో 33 కెవి 11 కెవి మూడు లైస్స్ కరెంటు స్తంభాలు ఒకదానికి ఒకటి తాకెలా ప్రమాదకరంగా మారినాయి.11 కెవి కరెంట్ తీగలు మనిషి నిలబడితే తాకే పరిస్థితిలు ఉన్నాయి. నీలోజిపల్లి పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న మూడు కరెంట్ లైన్ల స్తంభాలు ఒకదాని మీద ఒకటి పడినట్టుగా కిందకు వంగినాయి. అధికారులు పట్టించుకోకుండా సెస్ అధికారులు గాలికి వదిలేసారు. ఎప్పుడు కింద పడిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది.దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతులు పెట్టుకొని,భయపడుతున్నారు. నీలోజిపల్లి బస్టాండ్ దగ్గరలో 11 కెవి రహదారి పక్కన కరెంటు స్తంభం ఎప్పుడు కింద పడిపోయే ప్రమాదంలో ఉంది. పలుమార్లు ప్రజలు సెస్ అధికారులకు ఈ సమస్యపై తెలిపిన కూడా నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని అనుకుంటున్నారు. ప్రజల ప్రాణాలు పోతే గాని సెస్ అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలేరని అనుకుంటున్నారు.ఇప్పటికైన సెస్ అధికారులు వెంటనే స్పందించి,లూజ్ గా ఉన్న లైన్లను మరియు కరెంటు స్తంభాలు సరిచేసి, ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.