బలగం టివి ,, గంభీరావుపేట :
-అప్పుడు మంత్రి వస్తే అరెస్టులు ఉండే….
- ప్రజా సంక్షేమం కోసం ప్రతిపక్షాల సూచనలు స్వీకరిస్తాం..
-ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు..
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి వస్తే అరెస్టులు ఉండేవని, కనీసం వినతి పత్రం ఇద్దామన్న మంత్రి నీ కలవని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అని ప్రతిపక్షాల నాయకుల అరెస్టులు లేవు అని, ఎవరైనా స్వేచ్ఛాయుత వాతావరణంలో దరఖాస్తులు ఇవ్వవచ్చని రవాణా మరియు బీసీ సంక్షేమక శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ తో కలిసి పర్యటించారు. గంభరావుపేట మండలంలోని కొలమద్ది గ్రామపంచాయతీ భవనాన్ని, గంభీరావుపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ నీ, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మండలంలోని రాగట్ల పల్లెలోని ప్రైమరీ స్కూల్ భవనాన్ని, దూమల గ్రామంలోని స్కూల్ కాంపౌండ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస తో కలిసి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుకున్నారని, అందుకు అనుగుణంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని అన్నారు.ప్రజాస్వామ్యానికి విలువ నిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎటువంటి అడ్డంకులు సృష్టించకుండా ప్రతి ఒక్కరి దరఖాస్తును స్వీకరిస్తామని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ కంచెలను బద్దలు కొట్టి, ప్ర ప్రగతి భవన్ గా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందని అన్నారు. 6 గ్యారంటీలో భాగంగా ప్రజలకు ఒక రూపాయి ఖర్చు కాకుండా కోటి 20 లక్షల అప్లికేషన్ తీసుకున్నామని అన్నారు. నాడు టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు అప్లికేషన్ చేసుకుంటే, 150 నుండి 200 వరకు ఖర్చు అవుతుండేదని అన్నారు. ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించేందుకు స్వేచ్ఛాయుత వాతావరణంలో అప్లికేషన్ ఇస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. పదేండ్ల టిఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో ఒక్క అప్లికేషన్ ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా ఉండేదని, అలాంటి నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఆ పరిస్థితి లేదు అని అన్నారు. ఒకేసారి అన్ని సమస్యలు పరిష్కారం కావు అని ఒక్కొక్క సమస్య ప పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతామని అన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కి అవసరం ప్రభుత్వానికి లేదు అని, ప్రతిపక్షాల సూచనలు వింటూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అప్లై చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు వ్యతిరేకం కాదు అని, ఆటో డ్రైవర్లు అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. ఆర్టీసీ బలోపేతానికి కృషి చేస్తున్నామని,కొత్త బస్సులు కొంటున్నామని, కొత్త రిక్రూట్మెంట్ చేస్తున్నామని అన్నారు.ఇప్పటికే కొత్త బస్సులు కొన్నామని, గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామని అన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామని,కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకే పాటు పడుతుందని, ఏ పార్టీ సూచనలు ఇచ్చిన స్వీకరిస్తామని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామని అన్నారు. బీఆర్ఎస్ కీ షాక్.. కాంగ్రెస్ లోకి సర్పంచ్ కటకం శ్రీధర్..
గంభీరావుపేట సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో చేరారు కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయిన సర్పంచ్ బీజేపీ పార్టీలో, ఆ తర్వాత గ్రామ అభివృద్ధికై బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో చురుకుగా పాల్గొన్న శ్రీధర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు..
