బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
- అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి జవ్వాజి విమల
ఈ రోజు అమృత్ లాల్ శుక్లా కార్మిక భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో సూరం పద్మ. అధ్యక్షతన.సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి జవ్వాజి విమల మాట్లాడుతూ 19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మహిళలపై చేసిన దౌర్జన్యాల అణిచివేత శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా మహిళలు చేసిన పోరాట ఫలితంగా వచ్చిన హక్కులకు గుర్తుగా జరుపుకుంటున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆ స్ఫూర్తిని కనుమరుగు చేసే దిశగా పాలక పార్టీలు వేడుక దినోత్సవంగా మార్చడం జరుగుతుందని అన్నారు.
మనదేశంలో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయిన కూడా ఇంకా మహిళలపై వివక్ష కొనసాగిస్తున్నారు పురుషులతో సమానంగా పనిచేస్తున్న కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు మహిళలపై పని ప్రదేశంలో లైంగిక వేధింపులు తీవ్రంగా పని భద్రత లేకుండా పోతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశ అంగన్వాడి కాంట్రాక్ట్ బేసిక్ లో రకరకాల పేర్లు పెట్టి మహిళలతో వెట్టిచాకి చేస్తున్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీడీ కార్మికుల షాపింగ్ మాల్స్ కార్మికుల శ్రమ దోపిడి రోజురోజుకు పెరిగిపోతుంది అతి తక్కువ వేతనంతో షాపింగ్ మాల్స్ లో మహిళలతో పని చేయించుకుంటున్నారు లేబర్ అధికారులు షాపింగ్ మాల్స్ యజమానులు పైఎలాంటి ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూసి పడినట్టు వివరిస్తున్నారు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రామిక మహిళల హక్కులకై సమాన పనికి సమాన వేతనంపై మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించవలసిన అవసరం ఏర్పడిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు అరుణ్ కుమార్, సిఐటియు నాయకులు మిట్టపల్లి రాజమల్లు, జిందం కమలాకర్, నక్క దేవదాస్, మహిళా నాయకులు రైసా బేగం, కొక్కుల యశోద, సబ్బని శాంతమ్మ, బోడ శ్యామల, చౌరీ కల్పన, సుజాత, అరుణ, సౌమ్య, కోడం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.