ఉపాధిహామీ చట్టం మార్పులతో తుంగలో తోక్కుతున్న కేంద్ర ప్రభుత్వం
బలగం టివి, ,తంగళ్ళపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం రాళ్ల పేట గ్రామంలో ఉపాధి హామీ కార్మికులతో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోమ నాగరాజు సమావేశం నిర్వహించారు. అనంతరం తాను మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన సిరిసిల్లలోని లహరి బ్యాంక్ హాల్ లో నిర్వహించే ఉపాధి హామీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు బకాయిలు తదితర సమస్యల పైన జిల్లా స్థాయి సదస్సు నిర్వహిస్తామని 2006లో ఏర్పడ్డ ఉపాధి హామీ కార్మికుల చట్టంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టంలోని పలు అంశాలను తుంగలో తొక్కుతూ దేశంలోని 10 కోట్ల మంది కార్మికులకు ఉపయోగపడే విధంగా ఉన్న 1,18 వేల కోట్లను 90 వేల కోట్ల గాను ఇటీవల ప్రవేశపెట్టిన పార్లమెంట్ బడ్జెట్ లోను బిజెపి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బడ్జెట్ ను తగ్గిస్తూ ఉపాధి కార్మికుల పొట్టను కొట్టడాన్ని వ్యవసాయ కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉపాధి హామీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పైన వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని ఈ సదస్సు ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేకే మహేందర్ రెడ్డి,సిపిఐ జాతీయ నాయకులు చాడా వెంకటరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల మల్లేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి రాష్ట్ర ఉపాధ్యక్షులు సామల మల్లేశం,ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు దమ్ముని లక్ష్మణ్, హాజరవుతారని తెలిపారు. ఈ సదస్సును ఉపాధి హామీ కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవయ్య,కనకయ్య,భారతవ్వ, సత్తార్, ఇమామ్, షేక్ బోష, హైదర్, ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు.