రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్రైస్తవ ఐక్యతను చాటుదాం..

0
201
  • వేములవాడ మండల పాస్టర్ అసోసియేషన్ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు జీవన్ ఇండియా, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజ్ పల్లి గ్రామంలో గల సత్య దైవార్చన మందిరం లో వేములవాడ మండలం పాస్టర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు పసుల ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జీవన్ ఇండియా, ప్రధాన కార్యదర్శి కుమ్మరి రాజేష్ మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్రైస్తవులు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఐక్యత ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా పాస్టర్ ఎలీషా వాక్యం సందేశం చేస్తూ మాట్లాడుతూ పాస్టర్ లందరూ ఏక తీర్మానంతో సేవ పరిచర్యలు ముందుకు సాగుతూ ఐక్యంగా ఉండాలని సూచించారు. మండలానికి వచ్చిన నూతన జిల్లా కమిటీని ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ పాస్టర్స్ తిమోతి, రాజు, ఐజాక్, జిల్లా నూతన కమిటీ క్యాషియర్ ప్రభుదాస్, జాయింట్ సెక్రెటరీ జోసెఫ్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఆహారోను, జిల్లా మీడియా కన్వీనర్ కులేరి కిషోర్ కుమార్, వివిధ గ్రామాల పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here