సిరిసిల్ల న్యూస్:
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయి.
- మరింత ముందుకు తీసుకు వెళ్ళాలి
-టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సిబ్బందితో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
జిల్లాలోని కేజీబివి విద్యా సంస్థలలో 6-12 తరగతులు చదువుతున్న గ్రామీణ ప్రాంత కిశోర బాలికల కోసం జీవన నైపుణ్యాలు పెంపొందించడానికి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వారితో కుదుర్చుకున్న ఒప్పందం దోహదం చేస్తుందనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
తెలిపారు.
సోమవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హల్ లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సిబ్బంది జిల్లాలోని కేజిబివి విద్యాలయాలలో తమ వారం రోజుల అధ్యయన ఫలితాలను జిల్లా కలెక్టర్, మహిళా శిశు సంక్షేమం,విద్యా శాఖ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….
కేజిబివి లలో చదువుతున్న గ్రామీణ ప్రాంతం మరియు మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థినిలు ఆధునిక ప్రపంచంతో పోటీపడేలాగా జీవన నైపుణ్యాలను పెంపొందించడానికి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ కార్యక్రమాలు దోహదం చేస్తాయనీ చెప్పారు.
అన్ని కస్తూరిబా గాంధీ విద్యాలయాలలోని విద్యార్థులను రెండు గ్రేడులుగా విభజిస్తూ అందులో విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ వంటి అంశాలను ప్రాక్టికల్ గా నేర్పించడం, కృత్యాదార పద్దతి ద్వారా విద్యను అందించడం, ప్రయోగ నైపుణ్యాలు నేర్పించడం, స్వయంగా చేసి చూపించే నైపుణ్యాలను పెంపొందించాలని చెప్పారు.
ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, నిర్ణయం తీసుకోవడం లాంటి నైపుణ్యాలు ఎలా ఉండాలి, సమస్య పరిష్కార నైపుణ్యాలు ఎలా ఉండాలి, నాయకత్వం నైపుణ్యాలు ఎలా ఉండాలి, నిర్వహణ నైపుణ్యాలు ఎలా ఉండాలి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా కావాలంటే ఎలాంటి నైపుణ్యాలు ఉండాలి, ఇలాంటి అతి ముఖ్యమైన జీవన నైపుణ్యాలను నేర్పించడానికి, వివరించడానికి ప్రత్యేక మాడుల్స్ చేయాలన్నారు.
ఈనాటి పోటీ ప్రపంచంలో భాగంగా ఆంగ్లభాష నైపుణ్యాలు చాలా ముఖ్యమైనవి కాబట్టి ఆంగ్ల భాషలో మాట్లాడడానికి, ఆంగ్లభాషని పట్టు సాధించడానికి, ప్రత్యేకమైన మాడుల్స్ , శిక్షణలు ఏర్పాటు చేయాలన్నారు. సంవత్సరంలో జీవన నైపుణ్యాలలో పెంపుదలకు కృషి చేయాలన్నారు.
కార్యక్రమంలో ఫ్యాకల్టీ ఆఫ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ప్రాజెక్టు డైరెక్టర్, డాక్టర్ జోసఫీ అంతోని గారు, ప్రాజెక్టు కోఆర్డినేటర్ గ్రేస్ వర్షిత గారు, జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్,జిల్లా సంక్షేమ అధికారి, పి. లక్ష్మీరాజం గారు, మరియు జెండర్ అండ్ ఈక్విటీ కోఆర్డినేటర్ పద్మజ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.