బలగం టీవి, రాజన్న సిరిసిల్ల :
➡️బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటై బీఆర్ఎస్ ను బొందపెట్టాలి అని బండి సంజయ్ మాట్లాడటం విడ్డురంగా ఉంది
➡️కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశ్యం బీఆర్ఎస్ కు లేదు
➡️కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్
➡️ఇల్లంతకుంట మండల కేంద్రంలో మీడియా సమావేశం
➡️తెలంగాణ లో బలమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది
➡️ప్రజా సమస్యలపై ప్రజల తరపున ప్రజలతో కలిసి కొట్లాడుతాం
➡️వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి
➡️ప్రజలు కాంగ్రెస్ హామీలను నమ్మి ఓట్లేశారు
➡️తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్ గారు పదేళ్ళలో తెలంగాణ ను అభివృద్ధి లో అగ్రగామిగా నిలిపారు
➡️ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రజలే ప్రభుత్వాన్ని కూల్చుతారు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి లేదని,కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేయకుంటే ప్రజలే ప్రభుత్వాన్ని కూల్చుతారని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతుంది అని హెచ్చరిక చేయడం, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి పని చేద్దాం అని మాట్లాడడం విచిత్రంగా ఉందని పేర్కొన్నారు.
ఇల్లంతకుంట మండల కేంద్రంలో బుధవారం ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య ఇంట్లో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన బీఆర్ఎస్ కు లేదని, 39 మంది ఎమ్మెల్యేలు, శాసనమండలిలో మెజారిటీ సభ్యులతో బీఆర్ఎస్ బలమైన ప్రతిపక్షంగా ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోందని అన్నారు.
అనవసరంగా బీఆర్ఎస్ పార్టీపై బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలు సరికాదని..బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు.
కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లు ప్రజల ఆశీర్వాదంతో పని చేసిందని దేశ చరిత్రలో ఏ ప్రభుత్వాలు చేయలేని రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు₹10వేల పెట్టుబడి సాయం, రైతుభీమా ద్వారా రైతులు మరణిస్తే ₹5లక్షల సాయం, కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ ద్వారా ఆడబిడ్డ పెళ్లికి ₹లక్ష116 సాయం చేయడం జరిగిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యాసంగి నుంచి క్వింటాలు కు₹500, రైటుభరోసా పథకం ద్వారా ₹15000లు,, కళ్యాణలక్ష్మీ ద్వారా ₹ లక్షతో పాటు తులం బంగారం, 2లక్షల రుణమాఫీ వంటి హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేశారని పేర్కొన్నారు.
వంద రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్న కాంగ్రెస్ హామీ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, మహాలక్ష్మి పథకం ద్వారా 2500 ల సాయం చేస్తామన్నారు.200ల యూనిట్ల విద్యుత్ బిల్లు మాఫీ చేస్తామన్నారు.
కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ కడతారని స్వయానా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో మాట్లాడినారని పేర్కొన్నారు.
ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. 14ఏళ్ల సుదీర్ఘ పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని అన్నారు.తెలంగాణ రాష్ట్రం కోట్లాడి తెచ్చుకోవడం జరిగిందని..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 24 గంటల విద్యుత్, బీడుభూములకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగిందని,మిషన్ కాకతీయ ద్వారా 44వేల చెరువులు మరమ్మతులు చెశామని తెలిపారు.
ధాన్యం ఉత్పత్తి లో తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు.
ప్రభుత్వం వంద రోజుల్లో 200 యూనిట్ల కరెంటు, తులం బంగారం, మహాలక్ష్మి ద్వారా 2500, ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం కోసం₹5లక్షల సాయం వంటి హామీలు నెరవేర్చకుంటే ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పోరాటం తప్పకుండా చేస్తోందన్నారు.
కాంగ్రెస్ పై ప్రజలు ఎన్నో ఆశలతో ఓట్లు వేశారు..ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రజలే గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.