గంభీరావుపేట :
ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం ద్వారా జీవనోపాధి కోల్పోతున్నామని, ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు భరోసా కల్పించాలని గంభీరావుపేట మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడం హర్షణీయమని అన్నారు. 20 సంవత్సరాలుగా ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతు, కుటుంబాన్ని పోషించుకుంటున్నామని అన్నారు. ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ద్వారా మా జీవనోపాధి కోల్పోతున్నామని అన్నారు. ఆటో డ్రైవర్లను ఆదుకునే బాధ్యత ప్రభుత్వంకి ఉన్నదని,ప్రభుత్వం నెలకు 20,000 జీవనోపాధి కల్పించాలని కోరారు. ఈ ఈ కార్యక్రమంలో ఇబాదుల్లా ఖాన్, డి.రాజు, శంకర్, బాల్ శంకర్, కిషన్, శంకర్, రమేష్, రాజు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.