- బీసీ కులగణన చేపట్టడాన్ని స్వాగతిస్తున్నాం..
- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నేత పర్శ హన్మాండ్లు
బలగం టివి ,, గంభీరావుపేట :
ప్రభుత్వం బీసీ కులగణన రాష్ట్రంలో చేపట్టాలని నిర్ణయించడాన్ని బీసీ సంక్షేమ సంఘం పక్షాన స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు అన్నారు. మంగళవారం గంభీరావుపేట మండలంలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లను పర్శ హన్మాండ్లు మర్యాద పూర్వకం గా కలిసి, వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీసీ కులగన అనంతరం బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రి, విప్ లకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా స్పందించిన మంత్రి పొన్నం తప్పకుండా బీసీ హన్మాండ్లు మాట్లాడుతూ బీసీలకు న్యాయం జరిగే విధంగా భవిష్యత్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని హామీ ఇచ్చారని అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో బీసీ హాస్టల్ ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని, దీనికి మంత్రి స్థానికులంగా స్పందించారని అన్నారు.బీసీ నాయకుల సలహాలు సూచనలు తీసుకుంటామని మంత్రి అన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీసంక్షేమసంఘం నాయకులు వేములఅంజాగౌడ్,ఎలుక రాజు,శాత్రబోయిన దేవరాజు,నాగపురి రమేష్ గౌడ్,అల్లే దేవరాజు,శ్రీనివాస్,రాజు తదితరులు పాల్గొన్నారు.