రవి గురుస్వామి ఆధ్వర్యంలో వారం రోజులు బస్సుయాత్ర
బలగం టీవి, ఎల్లారెడ్డిపేట :
కార్తీక మాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మాల ధరించిన స్వాములు మంగళవారం రోజు ఇరుముడి కట్టుకొని శబరి యాత్రకు మంగళవారం రోజు బయలుదేరారు.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కార్తీక మార్గశిర మాసంలో ఎల్లారెడ్డిపేట మండలం అయ్యప్ప స్వాములు అత్యంత భక్తిశ్రద్ధలతో ముస్తాబాద్ రాజు గురు స్వామి, అల్మాస్పూర్ శ్రీను గురుస్వామి కరకరములు చే మాలలు ధరించి ఎల్లారెడ్డిపేట ఆలయంలో సన్నిధానం ఏర్పాటు చేసుకొని ఉదయాన్నే నాలుగు గంటలకు చల్లిన స్నానం చేసి సూర్యుడు ఉదయించక ముందే మొదటగా వినాయక స్వామిని, అనంతరం సుబ్రహ్మణ్యస్వామిని, అయ్యప్ప స్వామి చిత్రపటాలకు షోడోపచార పూజ చేసి భజన కీర్తనలతో పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటిపూట భోజనం చేసి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత చన్నీళ్లతో తలస్నానం చేసి సన్నిధానంలో ప్రతినిత్యం పూజలు చేస్తారు. ఇలా 41 రోజు అనగా మండల కాలం మాలలు ధరించి పూజలు నిర్వహించిన తర్వాత అయ్యప్ప ఆలయంలో ఇరుముడులను కట్టుకొని శబరి యాత్రకు రవి గురుస్వామి ఆధ్వర్యంలో వారం రోజులపాటు పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకుని శబరిమల సన్నిధానం చేరుకొని ఇరుముడిని స్వామివారికి చూపించి నియాభిషేకం చేస్తారు.శబరి యాత్ర ముగిసిన తర్వాత ఇంటి వద్దకు చేరుకొని మాల విరమణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ యాత్రలో ఉన్న స్వాములు అర్చకులు వజ్జల శ్రీకాంత్ శర్మ, గంట అంజయ్య, కోల బాపురెడ్డి, శ్రీగాద అశోక్ చారి, నంది నరేష్, గంజి సాయి కృష్ణ, కొండ రంజిత్ గౌడ్, ఎరుపుల రాజు, గంట కిరణ్, ఖమ్మం నారాయణ, పొన్నాల భానుచందర్, వంగ సురేష్,గాద ప్రవీణ్, యారటి కరుణాకర్( కొండాపూర్ సర్పంచ్), నిమ్మ దేవ్ రెడ్డి బాలాజీ, గట్టు గోపి,గన్న రాజిరెడ్డి, రాగుల లక్ష్మణ్ గౌడ్, సల్ల అఖిల్, ఎరుపుల సతీష్,బానోత్ గంగ,గన్న రాజు, గడ్డం తరుణ్, కందులూరి వెంకట సాయి లు ఉన్నారు.