కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, లారీల కాంట్రాక్టర్లతో సమావేశం
- అదనపు కలెక్టర్ గడ్డం నగేష్
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలువలకు అనుగుణంగా లారీలు అందుబాటులో ఉండాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. బోయినపల్లి, కోనరావుపేట మండలాలకు చెందిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, లారీల కాంట్రాక్టర్లతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా మండలాల్లో ధాన్యం కొనుగోళ్లు, నిలువుల పై ఆరా తీశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మాట్లాడుతూ.. కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన వెంట వెంటనే కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. ధాన్యం తరలించేందుకు లారీల కొరత లేకుండా చూసుకోవాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్ర ప్రకాశ్, డీఎం రజిత, డీసీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


