బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
- ఎల్.ఆర్.ఎస్. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
- అనధికార లే ఔట్ల క్రమబద్దికరణకు అవకాశం
- కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్ 18002331495 ఏర్పాటు
– జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
అనధికార లే ఔట్ల క్రమబద్దీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని జిల్లాలోని అర్హులైన వారందరూ గడువులోగా తమ ప్లాట్లను రెగ్యులరైజ్ కోసం సద్వినియోగం చేసుకోవాలనీ జిల్లా కలెక్టర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపినారు.
ఎల్.ఆర్.ఎస్ – 2020 క్రింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గత సెప్టెంబర్ 2024 లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కొన్ని దరఖాస్తుల క్రమబద్ధీకరణ అయింది. ఎల్ఆర్ఎస్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొన్ని నూతన నిర్ణయాలు తీసుకుంది. ఎల్ఆర్ఎస్ ప్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో రుసుము చెల్లించి క్రమబద్దీకరణ చేసుకోవచ్చని తెలిపారు. లక్షా 90 వేల వరకు ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల ఆమోదించే వాటికి మార్చి 31వ తేదీ వరకు క్రమబద్ధీకరణ చేసుకుంటే చెల్లించాల్సిన రుసుములో 25% మినహాయింపు ఉంటుంది. సబ్ రిజిస్టర్ ద్వారా నిర్ణయిత నమూనాలో నూతన దరఖాస్తులు సేకరించి ఎల్ఆర్ఎస్ కోసం మున్సిపల్ శాఖకు వివరాలు పంపించి క్రమబద్ధీకరిస్తారు.
జిల్లాలో 42వేలకు పైగా దరఖాస్తులు..
క్రమబద్ధీకరించని భూములలో ఎటువంటి రిజిస్ట్రేషన్లకు, నిర్మాణాలకు అనుమతించడం ఉండదు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా క్రమబద్దీకరణ చేసుకోవాలి. ఈ నెల 31వ తేదీ వరకు ప్రభుత్వం అందించిన అవకాశాన్ని వినియోగించుకొని 25% రాయితీ పొందాలి. జిల్లాలో 42,942 దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. అందులో 34229 దరఖాస్తులు ప్రాసెస్ చేయబడినవి. ఇంకా మిగిలిన దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయి.
పరిశీలన ప్రారంభం
2020 సంవత్సరంలో రూ 1000/- కట్టి ఎల్ఆర్ఎస్ లో దరఖాస్తు చేసుకున్న వారి అర్జీల పరిశీలన ప్రారంభమైంది. తమ ప్లాటు రెగ్యులరైజ్ చేసుకునే వారికి ప్లాటు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాటి వాల్యుయేషన్ ప్రకారం ఎల్ఆర్ఎస్లో దరఖాస్తు ఫీజు వేస్తారు. దీంతో ఎల్ఆర్ఎస్లో దరఖాస్తు చేసుకున్న వారికి లాభం జరుగుతుంది. 2020 సంవత్సరంలో అప్లికేషన్ చేసుకున్నవారు తమ తమ పురపాలక, సంబంధిత కార్యాలయాల్లో సంప్రదించి తమ ప్లాటును రెగ్యులైజ్ చేసుకోగలరు.
ఇబ్బందులు, అనుమానాలు నివృత్తి చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్..
అనధికార లే ఔట్ల క్రమబద్దీకరణలో ఏమైనా ఇబ్బందులు, అనుమానాలు నివృత్తి చేసేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో 18002331495 టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ పని దినాల్లో ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 05.00 గంటల వరకు సేవలు అందిస్తారనీ ఈ ప్రకటనలో పేర్కొన్నారు.