TS: మేడిగడ్డ ఆనకట్ట ఏడో బ్లాక్లో దెబ్బతిన్న కొంత భాగాన్ని పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నామని ఎల్అండ్ సంస్థ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు, నాణ్యతా ప్రమాణాలకు లోబడే మేడిగడ్డ ఆనకట్టను నిర్మించామని తెలిపింది. మేడిగడ్డ ఆనకట్ట ఐదు సార్లు వరద సీజన్లను ఎదుర్కొందని తెలిపింది. మేడిగడ్డ అంశం ప్రస్తుతం సంబంధిత అధికార వర్గాల పరిశీలన, విచారణ, చర్చల్లో ఉందని ఎల్అండ్ వివరించింది