రాజన్నసిరిసిల్ల:
అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం మాఫిలా ప్రభుత్వమే తప్ప మాఫియాల ప్రభుత్వం కాదని జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.
ఈరోజు సిరిసిల్ల తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ అరుణ రాఘవరెడ్డి మరియు బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని తెలంగాణ ఉద్యమం నుండి మొదలుకొని తెలంగాణ సాధించిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు కెసిఆర్ అందించిన సంక్షేమ ఫలాలు దేశమే అబ్బుర పరిచేలా ఉన్నాయని అన్నారు. సిరిసిల్లలో ఇంత అభివృద్ధి చేసిన కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని సిరిసిల్లలో మాఫియా రాజ్యం ఏలుతోందని కేకే అనడం సరికాదన్నారు. ఆటో డ్రైవర్లకు టాక్సీలు మాఫీ చేశామని, చిన్న కారు, సన్నకారు రైతులకు రుణమాఫీ చేశామని, మత్స్యకారులకు వాళ్ళ అభివృద్ధి కోసం ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేసామని ఇలా చెప్పుకుంటూ పోతే బిఆర్ఎస్ సర్కార్లో అన్ని మాఫీలే తప్ప మాఫియాలు లేవని గుర్తు చేశారు. ఇంకొకసారి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని వారు హెచ్చరించారు. కేకె మహేందర్ రెడ్డి మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడడం సరికాదని స్త్రీలను గౌరవించడం మన దేశ సంస్కృతి అని కేకే గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
ఈ విలేకరుల సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడూరు ప్రవీణ్, బొల్లి రామ్మోహన్ దార్ణం లక్ష్మీనారాయణ, కుంభాల మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.