ముద్ర,ఎల్లారెడ్డిపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ కేశవ పెరమాండ్ల ఆంజనేయ స్వామి ఆలయం లొ ఈనెల తేదీ 09-02-2024 శుక్రవారం రోజున మాఘ అమావాస్య సందర్భంగా గుట్టమీద జాతర ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.పెద్ద ఎత్తున జాతర ఉన్నందున ఆలయ పరిసర ప్రాంతాలను ముస్తాబు చేస్తున్నారు.మండలం తో పాటు పరిసర మండలాల ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆలయాన్ని దర్శించుకుంటారని వారు తెలిపారు.ఆలయ కమిటీ చైర్మన్ పారిపెళ్లి రామ్ రెడ్డి,వైస్ చైర్మన్ ముత్యాల ప్రభాకర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి పందిర్ల లింగం గౌడ్,సహాయ కార్యదర్శి వడ్నాల నారాయణ,
కోశాధికారి గంప నరేష్,
రైటర్ గుండాడి వెంకటరెడ్డి తెలియజేశారు.
