సంచలన నిర్ణయం తీసుకున్న మహబూబ్ నగర్ అభివృద్ధి ఫోరం చైర్మన్ మున్నూరు రవి

బలగంటివి, 

  • స్థానికులకే ఎంపీ టికెట్లు ఇవ్వాలని రాజకీయ పార్టీ అధిష్టాన వర్గాలకు హెచ్చరికలు జారీ
  • ప్రజల మద్దతు కూడగట్టడం కోసం బృహత్తర ప్రణాళిక సిద్ధం చేసిన మున్నూరు రవి
  • స్థానికేతరులైన ఎంపీలతో ఈ ప్రాంతానికి మేలు జరగదన్న వాదన ప్రజల్లోకి

మహబూబ్ నగర్ అభివృద్ధి ఫోరం.. ఎన్నో ప్రజా సమస్యలను వెలికి తీసి… ఎన్నో దౌర్జన్యాలను, దురాక్రమణాలను, కబ్జాలను, మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి సామాన్య ప్రజలకు అండగా నిలిచిన ఓ గొప్ప సంస్థ. ధనార్జన కోసమే స్వచ్ఛంద సేవా సంస్థలు ఏర్పాటు చేసి వారి పబ్బం గడుపుతున్న తర్వాత ముఖం చాటేసిన ఎంతోమంది స్వచ్ఛంద ప్రముఖుల జాతకాలను సైతం మహబూబ్నగర్ అభివృద్ధి ఫోరం బయటపెట్టి జనం మధ్యలో వారిని నిలబెట్టి కడిగి పారేసింది. మలిదశ తెలంగాణ ఉద్యమం కోసం తన జీవితాన్ని ధారపోసిన గొప్ప అభ్యుదయ వాది, మలిదశ తెలంగాణ పోరాట యోధుడు మున్నూరు రవి నాయకత్వంలో మహబూబ్ నగర్ అభివృద్ధి ఫోరం ఎన్నో అద్భుతాలను సృష్టించడమే కాకుండా వరదలు విపత్తులు వచ్చిన సమయంలో ప్రజల పక్షాన నిలబడి వారిని అన్ని రకాలుగా ఆదుకున్న గొప్ప చరిత్ర ఈ సంస్థ చైర్మన్ మున్నూరు రవికి సొంతం. ఆనాటి అధికార పార్టీ నేతల దురాగతాలను ధైర్యంగా ఎదుర్కొని మహబూబ్నగర్ అభివృద్ధి ఫోరం వేదికగా వారిని నిజస్వరూపాలు బయటపెట్టి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టిన ఘనత ఈ సంస్థ సొంతం.

అలాంటి గొప్ప చరిత్ర కలిగిన మహబూబ్ నగర్ అభివృద్ధి ఫోరం మరో బృహత్తర బాధ్యతను తలకెత్తుకోబోతోంది. మహబూబ్నగర్ అభివృద్ధి ఫోరం చైర్మన్ మున్నూరు రవి ఎంతో గురుతరమైన బాధ్యతతో స్థానిక ప్రజల పక్షాన నిలబడి స్థానికుడే పాలకుడుగా రావాలన్న సరికొత్త నినాదంతో పార్లమెంటు ఎన్నికల్లో అలజడి రేపడానికి సిద్ధమయ్యారు. మహబూబ్నగర్ ఎంపీలు గెలిచిన ఎంతోమంది పెద్దలు స్థానికులు కాకపోవడం వల్ల వారికి ఈ ప్రాంత సమస్యలు తెలుసుకుని తీరిక ఓపిక లేకపోవడం… జనం సమస్యల పట్ల వారు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఐదేళ్లు ఢిల్లీలోనే చక్కర్లు కొట్టి తమ పబ్బం గడుపుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజల కోసం నిర్దేశించినప్పటికీ ఎంపీల అలసత్వం వల్ల ఆ పథకాలు ప్రజలకు అందుబాటులో రాకుండా పోవడంతో ఈ ప్రాంతంలో అభివృద్ధి కానరావడం లేదని మున్నూరు రవి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ స్థానికుడే ఎంపీగా గెలుపొందితే ఆయా పథకాలు ఇక్కడ అమలు అయితే ఇక్కడ నిరుద్యోగంతో పాటు ప్రజలకు ఉపాధి మరియు రవాణా పెరిగే అవకాశం ఉంటుందని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. ఇప్పుడు ఇదే ఆస్త్రాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయ పార్టీల తాట తీయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ దఫా మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యుడిగా నిలబడే వ్యక్తి ఎవరైనా సరే స్థానికుడే అయి ఉండాలన్న సరికొత్త నినాదాన్ని మున్నూరు రవి తెరమీదకు తీసుకు రావడంతో రాజకీయ పార్టీల్లో అలజడి రేగుతోంది. ఏదో ఆషామాషీగా స్థానికుడే పాలకుడు కావాలన్న నినాదాన్ని ముందుకు తీసుకుపోవడానికి రవి సుతారము ఇష్టపడడం లేదు. స్థానికుడే ఎంపీ కావాలి అన్న గొప్ప నినాదాన్ని ఆయన ప్రజల మద్దతు తీసుకువెళ్లి జన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని క్రోడీకరిస్తూ పాలక పార్టీ పెద్దలతో దృష్టిలో ఉంచి ఈ ప్రాంతానికి స్థానికుడే ఎంపీ కావాలన్న నినాదాన్ని మరింత గట్టిగా వినిపించబోతున్నారు. మున్నూరు రవి తీసుకున్న ఈ నిర్ణయం పాలక పక్షమైన కాంగ్రెస్తో పాటుగా బిజెపి మరియు భారత రాష్ట్ర సమితి పెద్దల్లో గుబులు రేకెత్తిస్తోంది.

మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో నియోజకవర్గ పరిధిలో మున్నూరు రవి మహబూబ్నగర్ అభివృద్ధి ఫోరం తరపున ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా మున్నూరు రవి సిద్ధం చేసుకుంటున్నారు. ఎంపీగా స్థానికుడే ఉండాలన్న నిర్ణయం వెనుక వివరాలను ఆయన ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరించి వారిలో చైతన్యం తీసుకురావడానికి సిద్ధమయ్యారు. మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యుడిగా పోటీకి నిలబెట్టే ఆయా పార్టీ అధిష్టాన వర్గాలను సైతం మహబూబ్నగర్ అభివృద్ధి ఫోరం తరఫున మున్నూరు రవి నాయకత్వంలో ఒక ప్రత్యేక బృందం కలిసి దీని ఆవశ్యకతను వివరించనున్నారు. ఇప్పటివరకు స్థానికేతర్లు ఎంపీలుగా గెలిచి ఈ ప్రాంతానికి ఒరగబెట్టింది ఏమీ లేదని… ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా స్థానికేతర్లకు టికెట్లు ఇస్తే వారు ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్న హెచ్చరికలను సైతం ఆయా పార్టీ అధిష్టాన వర్గాలకు జారీ చేయనున్నారు. మహబూబ్నగర్ అభివృద్ధి ఫోరం తరపున మున్నూరు రవి తీసుకుంటున్న ఈ నిర్ణయం అన్ని రాజకీయ పార్టీల్లో వణుకు పుట్టిస్తుందని చెప్పాలి. స్థానికేతరుడు ఎంపీగా నిలబడి గెలిస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని… పార్టీలు తమ వినతిని కాదని బలవంతంగా తమ మీద స్థానికేతర్లను ప్రయోగం చేయాలని చూస్తే వారికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలన్న విషయాన్ని కూడా తమ కార్యాచరణలో మున్నూరు రవి సిద్ధం చేశారు. ఏది ఏమైనప్పటికీ మరి కొద్ది రోజుల్లో మహబూబ్నగర్ అభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో స్థానికుడే ఎంపీగా పోటీ చేయాలన్న నినాదం బలపడి రాజకీయ పార్టీలో తుఫాను సృష్టిస్తుందనే చెప్పాలి.

Recent Articles

spot_img

Related Stories

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Stay on op - Ge the daily news in your inbox

sekabet girişSekabetSekabetSekabet GirişSekabet Güncel GirişSekabetSekabetSekabet GirişSekabet Güncel Giriş