బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన ఎస్పీగా గితే మహేష్ బాబా సాహెబ్ ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గితే మహేష్ బాబా సాహెబ్ ములుగు ఓఎస్డి గా విధులు నిర్వహిస్తున్నారు. 2020 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన గితే మహేష్ బాబా సాహెబ్ రాజన్న సిరిసిల్ల పోలీస్ బాస్‌గా నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా నియమితులయ్యారు.