బలగం టీవీ, హైదరాబాద్:
దేశవ్యాప్తంగా ఇండిగో విమాన (IndiGo Airlines) సేవల్లో ఊహించని విధంగా భారీ అంతరాయం ఏర్పడింది. ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న (తేదీ ఇవ్వలేదు) ఏకంగా 550 ఇండిగో విమానాలు రద్దు కాగా, నేడు ఇప్పటికే 500కు ఇండిగో పైగా విమానాలు రద్దు అయినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబయి, కోల్‌కత్తా, చెన్నై, గోవా వంటి ప్రధాన ఎయిర్‌పోర్ట్‌లలో అకస్మాత్తుగా విమానాలు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లలోనే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ 225 ఇండిగో విమానాలు రద్దు, బెంగళూరు ఎయిర్‌పోర్ట్ 102 ఇండిగో విమానాలు రద్దు, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్92 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయని తెలిపిన ఇండిగో యాజమాన్యం. ముఖ్యంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ ప్రయాణానికి సంబంధించిన చెక్-ఇన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న తర్వాత విమానాలు రద్దు అయ్యాయని ఇండిగో యాజమాన్యం ప్రకటించడంతో, ప్రయాణికులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విమానాలను రద్దు చేయడంపై ఇండిగో వైఖరిని ప్రయాణికులు తప్పుపడుతున్నారు.
